Share News

రేవంత్‌ కాళ్లు పట్టుకుంటే కోమటిరెడ్డికి మంత్రి పదవి

ABN , Publish Date - Jan 30 , 2024 | 03:32 AM

అధికారమదంతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆటవికంగా ప్రవర్తిస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ మండలం గూడూరలో పంచాయతీ భవనం

రేవంత్‌ కాళ్లు పట్టుకుంటే కోమటిరెడ్డికి మంత్రి పదవి

అప్పట్లో మేం ఉద్యమిస్తే ఆయన వైఎస్‌ఆర్‌ బూట్లు నాకారు

ఆయనవి చిల్లర రాజకీయాలు: జగదీశ్‌ రెడ్డి

సూర్యాపేట, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): అధికారమదంతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆటవికంగా ప్రవర్తిస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ మండలం గూడూరలో పంచాయతీ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా జెడ్పీ చైర్మన్‌ సందీ్‌పరెడ్డిని పోలీసులతో మంత్రి దగ్గరుండి నెట్టివేయించారని, ఆయన చర్య దుర్మార్గమైనదని విమర్శించారు. ఆయనవి చిల్లర రాజకీయాలని, వాటికి ఎంతమాత్రం భయపడేది లేదన్నారు. మంత్రికి ఈ స్థాయి అహంకారం ప్రజాక్షేత్రంలో పనికిరాదని, ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు చైతన్యవంతులని, వారే ఆయనకు బుద్ధిచెబుతారన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తనను మంత్రి పదవి నుంచి తొలగిస్తారని తెలిసే మంత్రి పదవికి కోమటిరెడ్డి రాజీనామా చేశారని, ఆపై దొంగదీక్ష చేపట్టారని విమర్శించారు. అప్పట్లో తాము తెలంగాణ కోసం ఉద్యమం చేస్తే, కోమటిరెడ్డి నాటి సీఎం వైఎ్‌సఆర్‌ బూట్లు నాకారని ఆరోపించారు. బెడ్‌రూంలో సీఎం రేవంత్‌రెడ్డి కాళ్లను కోమటిరెడ్డి పట్టుకున్నారని, అందుకే మంత్రి పదవి ఇచ్చారని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుబంధు ఎందుకు ఇవ్వడంలేదో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. సందీప్‌ రెడ్డిని పోలీసులు నెట్టివేసిన చర్యపై ఏసీపీ, డీజీపీకి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.

Updated Date - Jan 30 , 2024 | 10:16 AM