Share News

Dharani: ధరణితో రైతులకు అనేక సమస్యలు: కోదండ రామిరెడ్డి

ABN , Publish Date - Jan 17 , 2024 | 04:03 PM

గత బీఆర్ఎస్(BRS) సర్కార్ ధరణి(Dharani Portal) పేరుతో రైతులకు అనేక సమస్యలు తెచ్చిపెట్టిందని ధరణి కమిటీ మెంబర్ కోదండ రామిరెడ్డి ఆరోపించారు.

Dharani: ధరణితో రైతులకు అనేక సమస్యలు: కోదండ రామిరెడ్డి

హైదరాబాద్: గత బీఆర్ఎస్(BRS) సర్కార్ ధరణి(Dharani Portal) పేరుతో రైతులకు అనేక సమస్యలు తెచ్చిపెట్టిందని ధరణి కమిటీ మెంబర్ కోదండ రామిరెడ్డి ఆరోపించారు. సెక్రటేరియట్‌(Telangana Secretariat)లో ధరణి సమస్యలపై కమిటీ మెంబర్లు.. అధికారులకు సమాచారం అడిగారు. ఇందుకుగానూ వారు సీసీఎల్ఏ(CCLA PPT) పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

ధరణితో వచ్చిన భూ సమస్యల పరిష్కారం బుధవారం నుంచే ప్రారంభమైనట్లు కమిటీ సభ్యులు తెలిపారు. సీసీఎల్ఏ కార్యాలయంలో రాబోయే సమావేశాలు ఉంటాయన్నారు. కోదండ రెడ్డి మాట్లాడుతూ.. "ధరణిలో సమస్యలు గుర్తించే పని మొదలైంది. ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ వస్తాం. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా మా కమిటీ పని చేస్తుంది. వచ్చే సోమవారం సీసీఎల్ఏ భేటీ తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తాం. పోర్టల్‌లో 35 సమస్యలున్నట్లు గుర్తించాం. ధరణి స్థానంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం పెట్టిన ప్రపోజల్‌పై అధ్యయనం చేయాల్సి ఉంది" అని అన్నారు.

Updated Date - Jan 17 , 2024 | 04:05 PM