Share News

కేకేఆర్‌ గౌతమ్‌ విద్యార్థుల హవా

ABN , Publish Date - May 15 , 2024 | 02:50 AM

సీబీఎ్‌సఈ 10వ తరగతి ఫలితాల్లో తమ విద్యార్థులు అద్భుతమైన ఫలితాలను సాధించారని కేకేఆర్‌ గౌతమ్‌ స్కూల్‌ ప్రకటించింది. తమ విద్యార్థి బియన్త్‌నాగ్‌

కేకేఆర్‌ గౌతమ్‌ విద్యార్థుల హవా

హైదరాబాద్‌, మే 14 (ఆంధ్రజ్యోతి): సీబీఎ్‌సఈ 10వ తరగతి ఫలితాల్లో తమ విద్యార్థులు అద్భుతమైన ఫలితాలను సాధించారని కేకేఆర్‌ గౌతమ్‌ స్కూల్‌ ప్రకటించింది. తమ విద్యార్థి బియన్త్‌నాగ్‌ గట్టు 500 మార్కులకు గాను 489 మార్కులను.. అర్జున్‌ జాగర్లమూడి, వై. చరిష్మాలు 487 మార్కులను సాధించారని తెలిపారు. 480 మార్కులకు పైగా 16 మంది విద్యార్థులు, 475 మార్కులకు పైగా 33 మంది విద్యార్థులు, 470 మార్కులకు పైగా 61 మంది విద్యార్థులు, 460 మార్కులకు పైగా 113 మంది, 450 మార్కులకుపైగా 205 మంది విద్యార్థులు సాధించారని వెల్లడించారు. ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సిబ్బందిని పాఠశాల యాజమాన్యం అభినందించింది.

Updated Date - May 15 , 2024 | 09:11 AM