Share News

నేడు తెలంగాణభవన్‌కు కేసీఆర్‌

ABN , Publish Date - Feb 06 , 2024 | 04:49 AM

అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీ కార్యాలయానికి వచ్చిన బీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు.. ఫలితాల వెల్లడి తర్వాత తొలిసారి మంగళవారం రానున్నారు. ఎర్రవెల్లి వ్యవసాయ

నేడు తెలంగాణభవన్‌కు కేసీఆర్‌

కృష్ణానది పరివాహక జిల్లాల నేతలతో సమావేశం

కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించడంపై చర్చ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీ కార్యాలయానికి వచ్చిన బీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు.. ఫలితాల వెల్లడి తర్వాత తొలిసారి మంగళవారం రానున్నారు. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో కాలు జారడంతో ఆయనకు తుంటి శస్త్రచికిత్స చేసిన విషయం విదితమే. దాన్నుంచి కోలుకున్న కేసీఆర్‌.. ఈ నెల 2న గజ్వేల్‌ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అదేరోజు నందినగర్‌లోని తన నివాసంలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. మంగళవారం తెలంగాణ భవన్‌కు రానున్నారు. ఈ సందర్భంగా కృష్ణానది పరివాహక జిల్లాలకు చెందిన వారితోపాటు బీఆర్‌ఎస్‌ పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్‌ సమావేశమవుతారు. నాగార్జున సాగర్‌, శ్రీశైలం సహా కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించడాన్ని ఖండిస్తూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకున్న రైతు వ్యతిరేక నిర్ణయాలను ప్రజల్లో ఎండగట్టేందుకు ఏం చేయాలన్న దానిపై ఆయన చర్చిస్తారు. అంతేకాకుండా కేఆర్‌ఎంబీ పరిధిలోకి ప్రాజెక్టులను తీసుకువెళ్లడాన్ని నిరసిస్తూ.. త్వరలోనే నల్గొండలో చేపట్టనున్న భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు, ఇతర కార్యాచరణపై పార్టీ నేతలకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు.

Updated Date - Feb 06 , 2024 | 04:49 AM