Share News

కేసీఆర్‌.. రైతులకు క్షమాపణ చెప్పాలి

ABN , Publish Date - Apr 05 , 2024 | 04:05 AM

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తీరు ‘ఒక మనిషిని చంపేసి, తర్వాత తానే అతని ఫొటోకు దండేసి దండం పెట్టినట్లు’గా ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,

కేసీఆర్‌.. రైతులకు క్షమాపణ చెప్పాలి

ఆ తర్వాతే కరీంనగర్‌ రావాలి: బండి సంజయ్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తీరు ‘ఒక మనిషిని చంపేసి, తర్వాత తానే అతని ఫొటోకు దండేసి దండం పెట్టినట్లు’గా ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. ‘కేసీఆర్‌.. మీ హయాంలో పంట నష్టపోయిన రైతులను ఏనాడైనా ఆదుకున్నారా?’ అని నిలదీశారు. అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు కేసీఆర్‌ శుక్రవారం వస్తుండడం శుభపరిణామమేనన్న సంజయ్‌.. ఆయన పదేళ్ల పాలనలో ఏనాడైనా రైతులను ఆదుకున్నారా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌కు చిత్తుశుద్ధి ఉంటే రాష్ట్రంలో రైతుల దుస్థితికి తానే కారణమని ఒప్పుకొని ముక్కు నేలకు రాసి బహిరంగ క్షమాపణ చెప్పి కరీంనగర్‌కు రావాలని సూచించారు.

Updated Date - Apr 05 , 2024 | 04:05 AM