Share News

అబద్ధాల ప్రొఫెసర్‌ కేసీఆర్‌

ABN , Publish Date - Apr 29 , 2024 | 05:00 AM

కేసీఆర్‌ ఒక అబద్ధాల ప్రొఫెసర్‌ అని, ఆయన ఇంటిపేరులో కల్వకుంట్ల తీసేసి.. అబద్ధాల కేసీఆర్‌ అని పెట్టాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు.

అబద్ధాల ప్రొఫెసర్‌ కేసీఆర్‌

ఆయన ఇంటిపేరులో కల్వకుంట్ల తీసేయాలి.. అబద్ధాల కేసీఆర్‌ అని చేర్చాలి

పదేళ్లు ప్రజలకు అందుబాటులో ఉన్నారా?

విపక్షంలోకి వచ్చాక ‘ఎక్స్‌’ ఖాతానా?

రాష్ట్రంలో కాంగ్రె్‌సకు 14 సీట్లు ఇవ్వండి

రాహుల్‌ ప్రధాని అవుతారు: జగ్గారెడ్డి

హైదరాబాద్‌/వెంగళరావునగర్‌, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్‌ ఒక అబద్ధాల ప్రొఫెసర్‌ అని, ఆయన ఇంటిపేరులో కల్వకుంట్ల తీసేసి.. అబద్ధాల కేసీఆర్‌ అని పెట్టాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు. కేసీఆర్‌ బాధ కరెంటు గురించి కాదని, పొలిటిక్‌ పవర్‌ లేదని ఆయన దిగులు పడుతున్నారని చెప్పారు. మాజీ మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ నివాసంలో భోజనం చేసేటప్పుడు కరెంటు మూడు సార్లు పోయిందంటూ కేసీఆర్‌ చెప్పిన మాటను ఎవరూ నమ్మబోరన్నారు. గాంధీభవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడారు. రాష్ట్రం ఎప్పుడు విడిపోతే అప్పుడు ముఖ్యమంత్రి కావాలని కేసీఆర్‌ అనుకునేవారన్నారు. రాష్ట్ర విభజన జరిగి.. ముఖ్యమంత్రి అయిన తర్వాత.. పదేళ్ల పాలనలో కేసీఆర్‌ ఎప్పుడైనా సచివాలయంలో ప్రజలకు అందుబాటులో ఉన్నారా అంటూ ప్రశ్నించారు. పదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్‌కు ‘ఎక్స్‌’ ఖాతా లేదని, ప్రతిపక్షంలోకి వచ్చాక ‘ఎక్స్‌’ అవసరం వచ్చిందన్నారు. కేసీఆర్‌ కుటుంబానికి ప్రజలు పొలిటికల్‌ పవర్‌ను కట్‌ చేశారని, గత్యంతరం లేక ఆయన లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి 14 ఎంపీ సీట్లు ఇవ్వాలని, రాహుల్‌గాంధీని ప్రధానిని చేయాలని జగ్గారెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్‌ నాయకులు

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులకు ఆకర్షితులై వివి ధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, తటస్థులు తమ పార్టీలో చేరుతున్నారని జగ్గారెడ్డి అన్నారు. హైదరాబాద్‌ వెంగళరావునగర్‌ డివిజన్‌కు చెందిన బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు దేవిరెడ్డి నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌, వివిధ పార్టీల నాయకులు జగ్గారెడ్డి సమక్షంలో కాంగ్రె్‌సలో చేరారు.

Updated Date - Apr 29 , 2024 | 05:00 AM