Share News

కేఆర్‌ఎంబీని కేంద్రానికి అప్పగించిందే కేసీఆర్‌

ABN , Publish Date - Feb 07 , 2024 | 11:15 PM

కృష్ణా పరివాహక ప్రాంత మేనేజ్‌మెంట్‌ను ప్రస్తుత ప్రభుత్వం కేంద్రానికి అప్పగించినట్లు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడటం సిగ్గుచేటని దేవరకద్ర ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు జి. మధుసూ దన్‌రెడ్డి విమర్శించారు.

కేఆర్‌ఎంబీని కేంద్రానికి అప్పగించిందే కేసీఆర్‌
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి

ఫ అవినీతిపై దృష్టి మరల్చేందుకే మళ్లీ ఉద్యమమంటున్న బీఆర్‌ఎస్‌

ఫ ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌, ఫిబ్రవరి 7 : కృష్ణా పరివాహక ప్రాంత మేనేజ్‌మెంట్‌ను ప్రస్తుత ప్రభుత్వం కేంద్రానికి అప్పగించినట్లు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడటం సిగ్గుచేటని దేవరకద్ర ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు జి. మధుసూ దన్‌రెడ్డి విమర్శించారు. గతంలో కేసీఆరే కృష్ణా పరివాహక ప్రాంతాన్ని కేంద్రానికి అప్పగించారని, మాకు అభ్యంతరంటూ లేదని అప్పట్లో లెటర్‌ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో కృష్ణానది పరివాహక ప్రాంతం 68 శాతం తెలంగాణలో ఉంటే, 32 శాతం మాత్రమే ఆంధ్రలో ఉందని, కానీ నీటి కేటాయింపులో 811 టీఎంసీలు ఉంటే 299 టీఎంసీలు తెలంగాణకు వస్తే 511 టీఎంసీలు ఆంధ్రకు పోతుంటే కళ్లు మూసుకొని కూర్చున్న మీరు ఇవ్వాళ ప్రాజెక్ట్‌లపై కాంగ్రెస్‌కు తెలివి లేదని మాట్లాడటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. మీ అతి తెలివి, మీరు చేసిన తప్పిదాల వల్లనే ఈ పరిస్థితి తలె త్తిందని దుయ్యబట్టారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని అడ్డగోలుగా దోచుకుని చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి బీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌ పార్టీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజలకు పారర్శకమైన పాలన అందించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పదేళ్ళ మీపాలనతో చేసిన అవినీతి, అరాచకాలను సీఎం ప్రజలకు తెలియజేస్తుంటే ప్రజల దృష్టిని మర ల్చేందుకు బీఆర్‌ఎస్‌ నేతలు జీర్ణించుకోలేక అవాకులు చెవాకులు పేలుతున్నా రని దుయ్యబట్టారు. మిషన్‌భగీరథలో రూ.7 వేల కోట్ల అవినీతి జరిగినట్లు విజి లెన్స్‌ బయటపెట్టిందని పేర్కొన్నారు. ఈ విచారణ నుంచి ప్రజల దృష్టిని మర ల్చేందుకు ఉద్యమాలు చేస్తానని చెప్పడం హాస్యాస్పందంగా ఉందన్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధికారప్రతినిధి హర్షవర్దన్‌రెడ్డి, నాయకులు చంద్రకుమార్‌గౌడ్‌, సాయిబాబ, సీజెబెనహర్‌, రాములు పాల్గొన్నారు.

విద్యాభివృద్ధికి కృషి చేస్తా

దేవరకద్ర : విద్యాభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 8 మండలాల్లో ఉన్న అన్ని ప్రభు త్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు, డీఈవోలతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలోని ప్రతీ మం డలంలో గల పాఠశాలల్లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డీఈవో రవీందర్‌, టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్‌రెడ్డి, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ అరవింద్‌కుమార్‌రెడ్డి, ఎంఈవో జయశ్రీ, పార్టీ మండల అధ్యక్షుడు అంజిల్‌రెడ్డి, మండల నాయకులు లక్ష్మీకాంత్‌రెడ్డి, ఆది హన్మంతురెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, వివిధ మండలాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Feb 07 , 2024 | 11:15 PM