Share News

Manchiryāla- ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కేసీఆర్‌, కేటీఆర్‌లను అరెస్టు చేయాలి

ABN , Publish Date - Apr 24 , 2024 | 11:25 PM

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి కేటీఆర్‌లను అరెస్టు చేయలని ఎమ్మెల్యే గడ్డం వివేకానంద అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో బుధవారం విలేకరుల సమావేశంలో పెద్దపల్లి పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణతో కలిసి మాట్లాడారు.

Manchiryāla-       ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కేసీఆర్‌, కేటీఆర్‌లను అరెస్టు చేయాలి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే గడ్డం వివేకానంద

ఏసీసీ, ఏప్రిల్‌ 24: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి కేటీఆర్‌లను అరెస్టు చేయలని ఎమ్మెల్యే గడ్డం వివేకానంద అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో బుధవారం విలేకరుల సమావేశంలో పెద్దపల్లి పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణతో కలిసి మాట్లాడారు. పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలమంతా కలిసి వంశీ గెలుపు కోసం కృషి చేస్తున్నామన్నారు. బీఆర్‌ఎస్‌పై విసిగిపోయి ఉన్న కార్యకర్తలు, నాయకులు కాంగ్రెస్‌లో చేరుతున్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ 14 ఎంపీ సీట్లను కైవసం చేసుకుం టుందన్నారు. ఎన్నికల అనంతరం ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు రూ. 2500 పథకం ప్రారంభిస్తామన్నారు. ఆగస్టు 15లోగా రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు. కేంద్రంలో బీజేపీ ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని యువతను మోసం చేసిందని, రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఇవ్వకుండా మొండిచేయి చూపించిందని విమర్శించారు. చెన్నూరులో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తామన్నారు. సింగరేణిలో కొత్త గనులు ఏర్పాటు చేయడంతో పాటు జైపూర్‌ పవర్‌ ప్లాంట్‌లో 800 మెగావాట్ల మరో యూనిట్‌ ను ఏర్పాటు చేసి 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇస్తామన్నారు. మందమర్రిలో లెదర్‌ పార్కును త్వరలో ప్రారంభిస్తామని, మాదిగలకు కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తామని తెలిపారు. సింగరేణి అప్పుల్లో ఉన్నప్పుడు కాకా వెంకటస్వామి 450 కోట్ల రుణం ఇప్పించి మూత పడకుండా చూసి లక్ష ఉద్యోగాలను కాపాడారని తెలిపారు. రామగుండం ఫెర్టిలైజర్‌ కార్పొరేషన్‌ పునరుద్ధరణకు కాకా కృషి చేశారన్నారు. విభజించి పాలించే సిద్దాంతాన్ని బీజేపీ, బీఆర్‌ఎస్‌లు పాటిస్తున్నాయన్నారు. బీఆర్‌ఎస్‌ పదేండ్ల పాలనలో రాష్ట్రాన్ని దోచుకుందని, దళితులను మోసం చేసిందన్నారు. గడ్డం వంశీ మాట్లాడుతూ ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని, ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మాదిగ హక్కుల దండోరా నాయకుడు రేగుంట సునీల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 24 , 2024 | 11:25 PM