Share News

కవిత పిటిషన్‌ విడిగా విచారణ?

ABN , Publish Date - Feb 17 , 2024 | 03:40 AM

ఢిల్లీ మద్యం కేసులో ఈడీ నోటీసులను సవాలు చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తన విచారణను ఫిబ్రవరి 28కి వాయిదా వేసింది. ఈ కేసును నళినీ చిదంబరం, అభిషేక్‌ బెనర్జీల కేసులతో

కవిత పిటిషన్‌ విడిగా విచారణ?

నళిని పిటిషన్‌తో సంబంధం లేదన్న సుప్రీం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కేసులో ఈడీ నోటీసులను సవాలు చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తన విచారణను ఫిబ్రవరి 28కి వాయిదా వేసింది. ఈ కేసును నళినీ చిదంబరం, అభిషేక్‌ బెనర్జీల కేసులతో ముడిపెట్టడంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బేలా త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌ కూడిన ధర్మాసనం శుక్రవారం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ కేసుల్లో విచారణాంశం వేరే కదా? అసలు కలిపి ఎలా విచారిస్తారు? అని జస్టిస్‌ బేలా త్రివేదీ ప్రశ్నించారు. గతంలో సుప్రీం బెంచియే ఈ నిర్ణయం తీసుకున్నదని న్యాయవాదులు కపిల్‌ సిబాల్‌, అభిషేక్‌ సంఘ్వీ ఆమె దృష్టికి తీసుకువచ్చారు. అయినా, అది సరైంది కాదని జస్టిస్‌ బేలా త్రివేదీ అన్నారు. న్యాయవాదులు కోరిక మేరకు 28కి కేసు విచారణను వాయిదా వేశారు. న్యాయమూర్తి వ్యాఖ్యల నేపథ్యంలో కవిత కేసు విచారణ వేరుగానే సుప్రీం చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన నిర్ణయం 28న విచారణ సందర్భంగా వెలువడే అవకాశం ఉంది.

Updated Date - Feb 17 , 2024 | 03:40 AM