Share News

తిహాడ్‌ జైలుకు కవిత

ABN , Publish Date - Mar 27 , 2024 | 02:46 AM

Kavitha for Tihad Jail

తిహాడ్‌ జైలుకు కవిత

ఏప్రిల్‌ 9 వరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌

ఢిల్లీ లిక్కర్‌ కేసులో రౌస్‌ అవెన్యూ కోర్టు తీర్పు

మధ్యంతర బెయిల్‌పై ఏప్రిల్‌ 1న విచారణ

న్యూఢిల్లీ, మార్చి 26(ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. తన కుమారుడికి పరీక్షలు ఉన్నాయని, అతణ్ని సంరక్షించాల్సిన బాధ్యత తనపై ఉన్నందు న బెయిల్‌ ఇవ్వాలంటూ కవిత చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. తిరిగి ఏప్రిల్‌ 9న కోర్టులో హాజరు పరచాలని పోలీసులను ఆదేశించింది. అయితే కవిత మధ్యంత ర బెయిల్‌ పిటిషన్‌పై ఏప్రిల్‌ 1న విచారణ జరుపుతామ ని పేర్కొంది. దీంతో పోలీసులు ఆమెను తిహాడ్‌ జైలుకు తరలించారు. కవిత ఈడీ కస్టడీ ముగియడంతో మంగళవారం ఉదయం 11.40 గంటలకు ఆమెను రౌస్‌ అవెన్యూ కోర్టుకు తీసుకొచ్చారు. కేసుపై సీబీఐ కోర్టు ప్రత్యేక న్యా యమూర్తి కావేరీ బవేజా విచారణ చేపట్టారు. ఈడీ తరఫున న్యాయవాది జోహెబ్‌ హుేస్సన్‌, కవిత తరఫున సీనియర్‌ న్యాయవాది విక్రమ్‌ చౌదరి ఇద్దరూ ఆన్‌లైన్‌లోనే వాదనలు వినిపించారు. తొలుత జోహెబ్‌ హుేస్సన్‌ వాదనలు వినిపిస్తూ.. ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో కవితది కీలకపాత్ర అని ఆరోపించారు. కేసు దర్యాప్తులోనే ఉన్నదని, మరికొంత మందిని ప్రశ్నించాల్సి ఉందని తెలిపారు. కవిత సమాజంలో ఎంతో పలుకుబడి ఉన్న వ్యక్తి అని, రాజకీయంగా, ఆర్థికంగా ఆమె ప్రభావితం చేయగలరన్నా రు. ఆమె బయట ఉంటే సాక్షులను బెదిరించే అవకాశం ఉందన్నారు. కేసులో కవి త పాత్రపై మరింత లోతైన దర్యాప్తు చేస్తున్నామని, మరిన్ని విషయాలు వెలుగులోకి రావాల్సి ఉందన్నారు. ఆర్థిక నేరాల దర్యాప్తు కఠినమైనదని, మొ దటి నుంచీ కవిత ఎంతో ప్రణాళికతో నేరానికి పాల్పడ్డారని న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. పైగా గతంలోనే కొన్ని సాక్ష్యాలను ఆమె ధ్వంసం చేశారని, ఇప్పుడు విడుదల చేస్తే మిగిలిన సాక్ష్యాలను కూడా మాయం చేసే అవకాశం ఉందని చెప్పారు.

కుమారుడికి పరీక్షలు.. బెయిల్‌ ఇవ్వండి...

కవిత తరఫున న్యాయవాది విక్రమ చౌదరి వాదనలు వినిపిస్తూ.. కవిత చిన్న కుమారుడికి 11వ తరగతి పరీక్ష లు ఉన్నాయని, ఈ సమయంలో ఆమె తన కుమారుడి తో ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కవిత జైలులో ఉంటే ఆ ప్రభావం కుమారుడి భవిష్యత్తుపై పడే అవకా శం ఉందని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. అందుకే ఆమెకు ఏప్రిల్‌ 16 వరకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో సాధారణ బెయిల్‌ పిటిషన్‌ విచారణకు కూడా అవకాశం ఇవ్వాలని కోరారు. మధ్యంతర బెయిల్‌తోపాటే ఈ నెల 30న(శనివారం) బెయిల్‌ పిటిషన్‌పై వాదనలకు అవకాశం ఇవ్వాలని విన్నవించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి.. కవితకు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధిస్తున్నట్లు ప్రకటించారు. తిరిగి ఏప్రిల్‌ 9వ తేదీ ఆమెను కోర్టులో హాజరు పరచాలని ఆదేశించారు. మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై ఏప్రిల్‌ 1న వాదనలు వింటామన్నారు. అయితే.. ఏప్రిల్‌ 9వ తేదీ ఉగాది పండుగ కావడంతో ఆ రోజు కూడా కేసు విచారణ వాయిదా పడే అవకాశం ఉంది. దాంతో మరో 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అన్నారు.

కుటుంబ సభ్యులతో గంటసేపు..

కవిత కేసులో తీర్పును న్యాయమూర్తి రిజర్వ్‌ చేయగా నే ఆమె తరఫున న్యాయవాది కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి అనుమతి కోరారు. దీంతో.. ఎవరెవరు కలుస్తారు? వాళ్లిప్పుడు అందుబాటులో ఉన్నారా? అని న్యాయమూర్తి అడిగారు. అందరూ అందుబాటులోనే ఉన్నారని చెప్పగా.. కోర్టు హాల్లోనే కలవాలని, దీనికోసం పిటిషన్‌ ఫైల్‌ చేయాలని సూచించారు. అందులో ఎవరెవరు కలుస్తారో వారి పేర్లు స్పష్టంగా ఉండాలని చెప్పా రు. ఆ నిబంధనల మేరకే పిటిషన్‌ దాఖలు చేసిన తర్వా త.. కుటుంబ సభ్యులు, ఆత్మీయులు కవితను కలిశారు. పిటిషన్‌లో పేర్కొన్న పేర్ల ప్రకారం ఒకరి తర్వాత ఒకరి ని లోపలికి అనుమతించారు. కవిత భర్త అనిల్‌, తోటికోడలు ననిత, రాజశేఖర్‌తోపాటు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, వైరా మాజీ ఎమ్మెల్యే మదన్‌ లాల్‌, వ్యక్తిగత సహాయకుడు శరత్‌ తదితరులు కవితను కలిసిన వారిలో ఉన్నారు. మధ్యాహ్నం 12.05 నుంచి సుమారు గంటసేపు వారితో మాట్లాడటానికి అవకాశం కల్పించారు. కాగా, గత వాయిదా సందర్భంలో కొంత ముభావంగా ఉన్న కవిత.. ఈసారి మాత్రం హుషారుగా కనిపించారు. అందరితో నవ్వుతూ మాట్లాడారు.

కడిగిన ముత్యంలా బయటికి వస్తా: కవిత

కోర్టు హాల్లోకి వెళ్లే సమయంలో కవిత మీడియాతో మాట్లాడారు. ‘‘ఇదో రాజకీయ కుట్ర. ఎన్నికల్లో లబ్ధి కోసం జరిగే కుట్ర. ఇది మనీలాండరింగ్‌ కేసు కాదు.. పొలిటికల్‌ లాండరింగ్‌ కేసు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఒక నిందితుడు బీజేపీలో చేరాడు. మరో నిందితుడికి బీజేపీ కూటమి టికెట్‌ ఇస్తోంది. మూడో నిందితుడు ఎన్నికల బాండ్ల రూపంలో బీజేపీకి రూ.50 కోట్లు ఇచ్చాడు. ఇది ముమ్మాటికీ కేసుల పేరుతో లొంగదీసుకునేందుకు జరిగే కుట్ర. తాత్కాలికంగా నన్ను జైలులో పెట్టొచ్చు. కానీ, కడిగిన ముత్యంలా బయటికి వస్తా’’ అని కవిత అన్నారు. కాగా, ఎమ్మెల్సీ కవితపై ఈడీ తప్పుడు కేసు బనాయించిందని బీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు.

Updated Date - Mar 27 , 2024 | 08:33 AM