Share News

‘మహాబలిజ’తో కాపు ఉపకులాలకు లాభం

ABN , Publish Date - Sep 25 , 2024 | 03:08 AM

‘మహాబలిజ’ పేరిట పునరేకీకరణతో కాపు ఉపకులాలకు ఎంతో లాభం చేకూరుతుందని పలువురు కాపు నేతలు స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని జలవిహార్‌లో జరిగిన

‘మహాబలిజ’తో కాపు ఉపకులాలకు లాభం

  • శ్రీకృష్ణ దేవరాయ ఉద్యోగ జేఏసీ వార్షికోత్సవంలో నేతల తీర్మానం

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ‘మహాబలిజ’ పేరిట పునరేకీకరణతో కాపు ఉపకులాలకు ఎంతో లాభం చేకూరుతుందని పలువురు కాపు నేతలు స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని జలవిహార్‌లో జరిగిన కృష్ణదేవరాయ ఉద్యోగ జేఏసీ 9వ వార్షికోత్సవానికి తెలంగాణతో పాటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, మహరాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి కాపు నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో దక్షిణ భారతదేశంలోని బలిజ, కాపు, తెలగ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపులను కలిపి మహాబలిజ పేరిట పునరేకీకరణ చేయాలని, తద్వారా విద్య, ఆర్థిక ప్రగతిని సాధించాలని తీర్మానించారు. ఆర్థిక, సామాజిక, సాంసృతిక పరమైన పండుగలను కలిసి నిర్వహించుకోవడం ద్వారా ఐక్యత సాధించాలని పలువురు నేతలు పేర్కొన్నారు. కార్యక్రమంలో శ్రీకృష్ణదేవరాయ ఉద్యోగ జేఏసీ కన్వీనర్‌ కె.ఎన్‌.కుమార్‌, ఐకాన్‌ గ్రూప్‌ వ్యవస్థాపకుడు మెండు చక్రపాణితో పాటు పలువురు సీనియర్‌ బ్యూరోక్రాట్లు, డాక్టర్లు, శాస్త్రవేత్తలు, వ్యాపారవేత్తలు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - Sep 25 , 2024 | 07:44 AM