Share News

‘కల్యాణలక్ష్మి’ ఆడబిడ్డలకు వరం

ABN , Publish Date - Feb 25 , 2024 | 12:32 AM

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పేదింటి ఆడబిడ్డలకు వరమని ఎమ్మెల్యే నేనావత్‌ బాలునాయక్‌ అన్నారు.

‘కల్యాణలక్ష్మి’ ఆడబిడ్డలకు వరం
లబ్ధిదారులకు చెక్కులు అందజేస్తున్న ఎమ్మెల్యే బాలునాయక్‌

చింతపల్లి, ఫిబ్రవరి 24: కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పేదింటి ఆడబిడ్డలకు వరమని ఎమ్మెల్యే నేనావత్‌ బాలునాయక్‌ అన్నారు. తహసీల్దార్‌ కార్యాలయంలో మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు శనివారం అంద జేశారు. పేదింటి ఆడబిడ్డలను ఆదుకునేందుకు ప్రభుత్వం కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్‌ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. రెండు నెలల్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకం కింద రూ.లక్ష 116తోపాటు తులం బంగారం కూడా అందించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం హమీ ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఇప్పటికే రెండు గ్యారంటీలను అమలు చేయగా మరో రెండు గ్యారంటీలను ఈ నెల 27న అమలు చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొండూరు భవానిపవన్‌కుమార్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు అంగిరేకుల నాగభూషణం, తహసీల్దార్‌ ఎండి.శంషొద్దిన్‌, ఎంపీడీవో సుజాత, డిప్యూటీ తహసీల్దార్‌ ఎండి. అర్షద్‌, మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ యాదయ్య, సింగిల్‌విండో చైర్మన్‌ లింగంపల్లి వెంకటయ్య, మాజీ సర్పంచ్‌ ముచ్చర్ల యాదగిరి పాల్గొన్నారు.

Updated Date - Feb 25 , 2024 | 12:32 AM