Share News

కల్యాణ.. వైభోగమే

ABN , Publish Date - Apr 17 , 2024 | 11:22 PM

నీలాకాశమే రంగుల పందిరిగా.. మెరిసే నక్షత్రాలే ముత్యాలుగా.. ఏకపత్నీవ్రతుడు.. పితృవాఖ్య పాలనాదక్షుడు.. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ సీతారాముల కల్యాణం వికారాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల్లో బుధవారం వైభవంగా జరుపుకున్నారు.

కల్యాణ.. వైభోగమే
జుంటుపల్లి సీతారాముల కల్యాణాన్ని జరిపిస్తున్న పండితులు

ఘనంగా శ్రీ రామనవమి వేడుకలు

నీలాకాశమే రంగుల పందిరిగా.. మెరిసే నక్షత్రాలే ముత్యాలుగా.. ఏకపత్నీవ్రతుడు.. పితృవాఖ్య పాలనాదక్షుడు.. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ సీతారాముల కల్యాణం వికారాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల్లో బుధవారం వైభవంగా జరుపుకున్నారు. ఉత్సవమూర్తులను పుష్పాలతో అలంకరించి.. వాయిద్యాల నడుమ కల్యాణ మండపానికి తీసుకొచ్చి భక్తుల జయజయధ్వానాల మధ్య సీతారాముల పరిణయాన్ని కనుల పండువగా నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధంమ రాముల వారు సీతమ్మకు మాంగల్యధారణ గావించారు. కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. పలు ఆలయాల్లో సకలగుణాభి రాముడు-సౌందర్యవతి సీతాదేవి కల్యాణ మహోత్సవంలో ప్రముఖులు పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీరామ నామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. సీతారాముల కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు తరలివచ్చారు.

- అంధ్రజ్యోతి, మేడ్చల్‌/ వికారాబాద్‌, ఏప్రిల్‌17

Updated Date - Apr 17 , 2024 | 11:22 PM