Share News

ఒక్కరోజే!

ABN , Publish Date - Jan 09 , 2024 | 11:34 PM

ట్రాఫిక్‌, మోటార్‌ వాహన నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులకు జారీ చేసిన ఈ-చలాన్ల చెల్లింపు గడువు ఒక్కరోజు మిగిలింది. ఏళ్ల తరబడి ఇ -చలాన్లు జారీ అయిన వాహనదారులు చెల్లించాల్సిన అపరాధ రుసుముపై సర్కారు రాయితీ ప్రకటించింది. అయితే రాయితీ అవకాశాన్ని వినియోగించుకోని వాహనదారుల నుంచి జరిమానా వ సూలు చేసేందుకు పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిసింది. బుధవారం వరకు ప్రభుత్వం కల్పించిన రాయితీని సద్వినియోగం చేసుకోని వారి నుంచి పెండింగ్‌ ఇ-చలాన్లకు సంబంధించి పూర్తి జరిమానా వసూలు చేయనున్నారు. ఈ ఈ క్రమంలో పోలీసు శాఖ అధికారులు వాహనాల తనిఖీలు ముమ్మరం చేయనున్నారు.

ఒక్కరోజే!

నేటితో ముగియనున్న చలాన్ల రాయితీ గడువు

- చలానా చెల్లింపుల్లో సర్కారు రాయితీ

63.71 శాతం వాహనదారులు మాత్రమే సద్వినియోగం

గడువు దాటిన తర్వాత ప్రత్యేక తనిఖీలు

ఇ- చలాన్లు పూర్తిగా వసూలు చేయనున్న అధికారులు

ట్రాఫిక్‌, మోటార్‌ వాహన నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులకు జారీ చేసిన -చలాన్ల చెల్లింపు గడువు ఒక్కరోజు మిగిలింది. ఏళ్ల తరబడి ఇ -చలాన్లు జారీ అయిన వాహనదారులు చెల్లించాల్సిన అపరాధ రుసుముపై సర్కారు రాయితీ ప్రకటించింది. అయితే రాయితీ అవకాశాన్ని వినియోగించుకోని వాహనదారుల నుంచి జరిమానా వ సూలు చేసేందుకు పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిసింది. బుధవారం వరకు ప్రభుత్వం కల్పించిన రాయితీని సద్వినియోగం చేసుకోని వారి నుంచి పెండింగ్‌ ఇ-చలాన్లకు సంబంధించి పూర్తి జరిమానా వసూలు చేయనున్నారు. ఈ ఈ క్రమంలో పోలీసు శాఖ అధికారులు వాహనాల తనిఖీలు ముమ్మరం చేయనున్నారు.

వికారాబాద్‌, జనవరి 9 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : ట్రాఫిక్‌, మోటార్‌ వాహన నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులకు జారీ చేసిన ఇ-చలాన్ల చెల్లింపులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాయితీ గడువు నేటితో ముగియనుంది. ఇ -చలాన్లు జారీ అయిన వాహనదారులు తాము చెల్లించాల్సిన అపరాధ రుసుము (జరిమానా)ను నెలలు, సంవత్సరాల తరబడి చెల్లించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం భారీ రాయితీ ప్రకటించింది. ఇ- చలాన్‌ కేసులతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులకు ఊరట కలిగించేందుకు ప్రభుత్వం జరిమానాలో భారీ రాయితీ ప్రకటించినా సోమవారం వరకు జిల్లాలో 63.71 శాతం మాత్రమే సద్వినియోగం చేసుకున్నారు. ద్విచక్రవాహనాలు, ఆటోలపై నమోదైన ఈ చలాన్‌ల జరిమానాలో 80 శాతం రాయితీ ప్రకటించగా, విధించిన అపరాధ రుసుములో వారు 20 శాతం చెల్లిస్తే ఇ-చలానాలు తొలగిపోతాయి. ఫోర్‌ వీలర్‌ వాహనదారులు (లైట్‌ మోటార్‌, హెవీ మోటార్‌ వాహనాలు)కు జారీ చేసిన ఇ-చలాన్లపై విధించిన జరిమానాలో 60 శాతం రాయితీ ప్రభుత్వం ప్రకటించగా, మిగిలిన 40శాతం చెల్లిస్తే సరిపోతుంది. అదే ఆర్టీసీ బస్సులకు 90 శాతం రాయితీ ప్రకటించారు. రాయితీ పోగా మిగిలిన 10 శాతం జరిమానా చెల్లిస్తే ఇ-చలాన్లు పరిష్కారం కానున్నాయి.

చెల్లించని 36.29 శాతం మంది

ఇ-చలాన్లపై విధించిన జరిమానా బకాయీల మొత్తాన్ని ఒకేసారి చెల్లిస్తేనే ప్రభుత్వం ప్రకటించిన రాయితీ వర్తించేలా నిబంధన విధించారు. ఇ- చలాన్లు నమోదైన వాహనదారులు తాము చెల్లించాల్సిన జరిమానా చెల్లింపుల్లో రాయితీతో చెల్లించేందుకు గత డిసెంబరు 27వ తేదీ నుంచి అనుమతించగా, బుధవారంతో ఆగడువు ముగియనుంది. రాయితీతో జరిమానా చెల్లించేందుకు ఒకరోజు మాత్రమే గడువు ఉంది. ఇ- చలాన్‌ కేసులు నమోదైన వారిలో ఇంకా 36.29 శాతం మంది వాహనదారులు మిగిలిపోయారు. ఇ-ఛలాన్‌ విధానం ప్రారంభమైనప్పటి నుంచి జిల్లాలో ట్రాఫిక్‌ నిబంధనలు, మోటార్‌ వాహనాల నిబంధనలను ఉల్లంఘించిన వాహనాలపై 8,17,551 ఇ-చలాన్లు నమోదు చేసి రూ.33,87,43,190 అపరాధ రుసుము విధించారు. ఇ-చలానాలు జారీ చేసిన వాహనాలకు సంబంధించి ఈనెల 8వ తేదీ వరకు 520910 చలాన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన రాయితీతో రూ.11,27,88,372 అపరాధ రుసుము చెల్లించారు. ఇంకా జిల్లాలో 296641 ఇ-చలాన్లకు సంబంధించి రూ.11,84,46,990 అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంది.

ముందుకు రాని వాహనదారులు

పెండింగ్‌లో ఉన్న ఇ-చలాన్లు పరిష్కరించేందుకు పోలీసు శాఖ ఎంతో శ్రమ కోరుస్తున్నా ఆశించిన ఫలితం లేకపోవడంతో వాహనదారులు చెల్లించాల్సిన జరిమానాలో భారీ రాయితీ ఆఫర్‌ ఇచ్చింది. పెండింగ్‌ చలానాలు పరిష్కరించేందుకు జరిమానాలో రాయితీ కల్పిస్తే చెల్లించడానికి ముందుకు వస్తారని, తద్వారా కేసుల పెండెన్సీ ఉండదని భావించిన పోలీసు శాఖ వాహనదారులు అవకాశం కల్పించింది. గతనెల 27వ తేదీ నుంచి ఈనెల 10వ తేదీ వరకు ఇ-చలాన్లు జారీ అయిన వాహనదారులు రాయితీతో చెల్లించే అవకాశం ప్రభుత్వం కల్పించింది. ఇ - చలాన్‌ జరిమానాల చెల్లింపుల్లో వాహనదారులు చాలా వరకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసు శాఖ గుర్తించింది. తనిఖీల సమయంలో వాహనంపై ఈ-చలానాలు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే చెల్లించాలని, లేనిపక్షంలో పక్కన పెట్టేస్తామంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నా.. ఇ-చలాన్లపై విఽధించిన జరిమానా చెల్లించడానికి వాహనదారులు ఆశించిన స్థాయిలో ముందుకు రావడం లేదు. పెండింగ్‌లో పేరుకుపోతున్న ఇ-చలాన్లను క్లియర్‌ చేసేందుకు 2022లో అప్పటి ప్రభుత్వం వాహనదారులు చెల్లించాల్సిన జరిమానాలపై ప్రత్యేక రాయితీ ప్రకటించింది. ఇ-చలానాలు ఉన్న వాహనదారులు చాలా వరకు సద్వినియోగం చేసుకున్నా.. కొందరు చెల్లించకుండా మొండికేశారు. వాహనాలపై ఉన్న పెండింగ్‌ చలానాలను క్లియర్‌ చేసేందుకు కొత్త ప్రభుత్వం భారీ రాయితీ ప్రకటించింది.

2018 నుంచి అమల్లోకి

మోటార్‌ వాహనాల చట్టాలను, ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించే వాహనదారులకు జరిమానా విధించేందుకు రాష్ట్రంలో 2018 నుంచి ఇ- చలాన్‌ విధానం అమల్లోకి తీసుకువచ్చారు. ఈ విధానంతో నిబంధనలను ఉల్లంఘించే వాహనదారులపై ఇ-చలాన్లు జారీ చేసి జరిమానా విధిస్తూ వస్తున్నారు. వాహనదారులు రహదారి, ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమించినట్లు గుర్తిస్తే పోలీసు సిబ్బంది తమ కెమెరాల్లో వాహనాన్ని ఫోటో తీసి పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. తేదీ, సమయం, ఉల్లంఘన తీరు, ఏ సెక్షన్‌ కింద ఇ- చలాన్‌ వేశారు, విధించిన జరిమానా తదితర వివరాలతో వాహన యజమాని మొబైల్‌ నంబర్‌కు సమాచారం పంపిస్తున్నారు. ఇ-చలాన్‌ నమోదైన విషయం తెలిసినా వాహనదారులు సకాలంలో జరిమానా చెల్లించడంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు.

గడువు ముగిశాక ప్రత్యేక వాహన తనిఖీలు

ఇ- చలానాలకు సంబంధించి కల్పించిన రాయితీ అవకాశాన్ని వినియోగించుకోని వాహనదారుల నుంచి జరిమానా వ సూలు చేసేందుకు పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిసింది. బుధవారం వరకు ప్రభుత్వం కల్పించిన రాయితీని సద్వినియోగం చేసుకోని వారి నుంచి పెండింగ్‌ ఇ-చలాన్లకు సంబంధించి పూర్తి జరిమానా వసూలు చేయనున్నారు. ఇ-చలాన్ల జరిమానా చెల్లింపులపై ప్రభుత్వం విధించిన గడువు ముగిసిన తరువాత పోలీసు శాఖ అధికారులు వాహనాల తనిఖీలు ముమ్మరం చేయనున్నారు. అంతే కాకుండా మోటార్‌ వాహన నిబంధనలను ఉల్లంఘించే వాహనదారులపై కఠినంగా వ్యవహరించాలని పోలీసు శాఖ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Updated Date - Jan 09 , 2024 | 11:37 PM