Share News

పరిశ్రమల్లో యువతకు ఉద్యోగాల కల్పన

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:03 AM

స్థానిక పరిశ్రమల్లో యువతకు ప్రాధాన్యత కల్పించేందుకు కృషి చేస్తానని నల్లగొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అన్నారు.

పరిశ్రమల్లో యువతకు ఉద్యోగాల కల్పన
సూర్యాపేట జిల్లా నడిగూడెంలో మాట్లాడుతున్న శానంపూడి సైదిరెడ్డి

నల్లగొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి

దామరచర్ల, ఏప్రిల్‌ 26: స్థానిక పరిశ్రమల్లో యువతకు ప్రాధాన్యత కల్పించేందుకు కృషి చేస్తానని నల్లగొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. సామాన్యులకు కేంద్ర ప్రభుత్వ పథకాలు అందేలా నిరంతరం కృషి చేస్తానన్నారు. దామరచర్లలో దినదినాభివృద్ధి చెందుతున్నప్పటికీ రైల్వేస్టేషన్‌ అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయం రైల్వే శాఖ దృష్టికి సమస్యను తీసుకెళ్లి సమస్యను పరిష్కరిచేందుకు కృషి చేస్తానన్నారు. అదేవిధంగా అభివృద్ధే ప్రధానమంత్రి మోదీ కల అన్నారు. సాగు, తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు ముందుంటానన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి, రాష్ట్ర నాయకుడు సాధినేని శ్రీనివాస్‌, జిల్లా కిసాన్‌మోర్ఛ అధ్యక్షుడు సీతారాంరెడ్డి, ఈగ సైదారావు, జానకిరాంరెడ్డి, గొంగటి నరసింహారెడ్డి, నాగిరెడ్డి, భీష్మారెడ్డి పాల్గొన్నారు.

తెలంగాణ అభివృద్ధికి రూ.10లక్షల కోట్లు కేటాయింపు

కోదాడ రూరల్‌, నడిగూడెం: తెలంగాణ అభివృద్ధికి కేంద్రం పదేళ్లలో రూ.10లక్షల కోట్లు కేటాయించిందని నల్లగొండ పార్లమెంట్‌ బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని తమ్మర సీతారామచంద్రస్వామి దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం తమర్మ గ్రామంలో, నడిగూడెం మండల కేంద్రంలో ప్రచారం నిర్వహించారు. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అందిస్తూ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తుందని, మోదీ మరోమారు ప్రధాని కావడం ఖాయమన్నారు. కాంగ్రెస్‌ నాయకులు మాయమాటలు నమ్మి మోస పోవద్దన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరిగిందన్నారు. కుటుంబ పార్టీలకు ప్రజలు తగిన బుద్ధిచెప్పాలన్నారు. ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు చాడ శ్రీనివాసరెడ్డి, జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యరెడ్డి, నియోజకవర్గ కన్వీనర్‌ కనగాల నారాయణ, బొలిశెట్టి కృష్ణయ్య, నూనె సులోచన, బండారు కవితారెడ్డి, అక్కిరాజు, యశ్వంత్‌, ఓరుగంటి కిట్టు, శ్రీలతరెడ్డి, హనుమంతరావు, చిట్టిబాబు, అంజియాదవ్‌, అమరేందర్‌రెడ్డి, దున్నా సతీష్‌, నాగరాజు, శోభారాణి, ఉపేంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2024 | 12:03 AM