Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

నేడు మరో 5,278 మందికి ఉద్యోగ నియామక పత్రాలు

ABN , Publish Date - Mar 04 , 2024 | 04:36 AM

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రకియ్ర కొనసాగుతోంది. ప్రభుత్వ విభాగాల్లోని వివిధ ఉద్యోగాల భర్తీలు కోర్టుకు వెళ్లగా.. వాటిని పరిష్కరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆయా పోస్టులను భర్తీ చేస్తోంది.

నేడు మరో 5,278 మందికి  ఉద్యోగ నియామక పత్రాలు

హైదరాబాద్‌, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రకియ్ర కొనసాగుతోంది. ప్రభుత్వ విభాగాల్లోని వివిధ ఉద్యోగాల భర్తీలు కోర్టుకు వెళ్లగా.. వాటిని పరిష్కరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆయా పోస్టులను భర్తీ చేస్తోంది. ఇందులో భాగంగా సోమవారం మరో 5,278 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనుంది. వీరిలో సంక్షేమ గురుకులాల్లో ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (టీజీటీ), డిగ్రీ, జూనియర్‌ లెక్చరర్‌ ఉద్యోగానికి ఎంపికైన వారు 4,638మంది, పోలీసు శాఖలోని వివిధ విభాగాల్లో 565, వైద్య శాఖలోని వివిధ విభాగాల్లో 75పోస్టులకు ఎంపికైన వారు ఉన్నారు. హైదరాబాద్‌ ఎల్‌బీ స్టేడియంలో సోమవారం జరిగే కార్యక్రమంలో సీఎం రేవంత్‌ చేతులమీదుగా వీరంతా నియామక పత్రాలు అందుకోనున్నారు.

Updated Date - Mar 04 , 2024 | 08:03 AM