Share News

పీహెచ్‌డీ ప్రవేశాలకు జేఎన్‌టీయూ నోటిఫికేషన్‌

ABN , Publish Date - Jan 25 , 2024 | 04:24 AM

జవహర్‌లాల్‌ సాంకేతిక విశ్వవిద్యాలయం 2024-25కు గాను పీహెచ్‌డీ నోటిఫికేషన్‌ను బుధవారం విడుదల చేసింది.

పీహెచ్‌డీ ప్రవేశాలకు జేఎన్‌టీయూ నోటిఫికేషన్‌

హైదరాబాద్‌ సిటీ, జనవరి 24(ఆంధ్రజ్యోతి): జవహర్‌లాల్‌ సాంకేతిక విశ్వవిద్యాలయం 2024-25కు గాను పీహెచ్‌డీ నోటిఫికేషన్‌ను బుధవారం విడుదల చేసింది. యూనివర్సిటీలో, యూనివర్సిటీ పరిధిలోని పరిశోధన కేంద్రాల్లో ఇంజనీరింగ్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అంశాలకు సంబంధించి మొత్తం 220 సీట్లు ఉన్నట్లుగా నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అత్యధికంగా కంప్యూటర్‌ సైన్స్‌ విభాగం నుంచి 62 సీట్లుండగా, మెకానికల్‌ 36, ఎలక్ట్రికల్‌ 25, సివిల్‌ 4, ఈసీఈ 18, మెటలర్జీ 8, బయోటెక్నాలజీ 6, కెమిస్ట్రీ 10, ఎన్విరాన్‌మెంట్‌ 4, మ్యాథమేటిక్స్‌ 8, నానోటెక్నాలజీ 3, ఫిజిక్స్‌, వాటర్‌ రిసోర్సెస్‌ 4, ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌ 6 సీట్లు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.

అవకతవకలపై రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు

గతేడాది పీహెచ్‌డీ అడ్మిషన్లలో అవతవకలు జరిగాయని కొందరు ఫ్రొఫెసర్లు, విద్యార్థులు జేఎన్‌టీయూ రిజిస్ట్రార్‌కు బుధవారం ఫిర్యాదు చేశారు. ప్రవేశపరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రాన్ని మెకానికల్‌ విభాగానికి చెందిన ఒక విద్యార్థికి ముందుగానే కొందరు ప్రొఫెసర్లు చేరవేశారని తెలిపారు. ఈ విషయమై విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Updated Date - Jan 25 , 2024 | 09:56 AM