Share News

హాట్‌ టాపిక్‌గా జితేందర్‌ రెడ్డి ట్వీట్‌..

ABN , Publish Date - Mar 01 , 2024 | 04:21 AM

బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు జితేందర్‌రెడ్డి చేసిన ఓ ట్వీట్‌ బీజేపీ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. దుస్తులు లేకుండా ఓ చిన్న పిల్లోడు సుదీర్ఘంగా

హాట్‌ టాపిక్‌గా జితేందర్‌ రెడ్డి  ట్వీట్‌..

హైదరాబాద్‌, ఫిబ్రవరి 29(ఆంధ్రజ్యోతి): బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు జితేందర్‌రెడ్డి చేసిన ఓ ట్వీట్‌ బీజేపీ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. దుస్తులు లేకుండా ఓ చిన్న పిల్లోడు సుదీర్ఘంగా ఆలోచిస్తూ.. అటూ ఇటూ తిరుగుతున్న ఓ ఫన్నీ వీడియోను ఆయన ఎక్స్‌లో షేర్‌ చేశారు. ఎన్నికల ముందు వాట్‌ టు డూ.. వాట్‌ నాట్‌ టు డూ.. అంటూ వీడియోను పోస్ట్‌ చేశారు. మహబూబ్‌నగర్‌ ఎంపీ టికెట్‌ కోసం గట్టిగా పట్టుబడుతున్న జితేందర్‌రెడ్డి.. ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో పెట్టారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ వీడియోను ఆయన ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులకు ట్యాగ్‌ చేశారు.

Updated Date - Mar 01 , 2024 | 10:03 AM