Share News

హస్తం గూటికి జితేందర్‌ రెడ్డి

ABN , Publish Date - Mar 16 , 2024 | 04:30 AM

మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌ రెడ్డి బీజేపీకి గుడ్‌బై చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ సమక్షంలో ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరారు

హస్తం గూటికి జితేందర్‌ రెడ్డి

బీజేపీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా

రేవంత్‌, భట్టి, ఉత్తమ్‌ సమక్షంలో కాంగ్రె్‌సలోకి చేరిక

కుమారుడు మిథున్‌ రెడ్డి కూడా..

ప్రభుత్వ సలహాదారు, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా జితేందర్‌ రెడ్డి

హైదరాబాద్‌, మహబూబ్‌నర్‌, కల్వకుర్తి, మార్చి 15(ఆంధ్రజ్యోతి): మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌ రెడ్డి బీజేపీకి గుడ్‌బై చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ సమక్షంలో ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరారు! ఆ వెంటనే ఆయన్ను ప్రభుత్వ పదవులూ వరించాయి! ఈ మేరకు శుక్రవారం పరిణామాలన్నీ చకచకా జరిగిపోయాయి. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కొనసాగిన జితేందర్‌ రెడ్డి, మహబూబ్‌నగర్‌ నుంచి ఆ పార్టీ టికెట్‌ను ఆశించారు. అక్కడ పార్టీ టికెట్‌ డీకే అరుణకు రావడంతో జితేందర్‌ రెడ్డి తీవ్ర నిరాశకు గురైన సంగతి తెలిసిందే. గురువారం సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా జితేందర్‌ రెడ్డి నివాసానికి వెళ్లి పార్టీలో చేరాలని ఆహ్వానించారు. ఆ మేరకు రేవంత్‌తో చర్చలు జరిపిన జితేందర్‌ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాక సీఎం రేవంత్‌ రెడ్డి నివాసానికి వెళ్లారు. అక్కడ రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్‌ కుమారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. జితేందర్‌కు దీపామున్షీ దాస్‌ పార్టీ కండువా కప్పారు. ఈ సందర్భంగా జితేందర్‌ రెడ్డి కుమారుడు మిథున్‌ రెడ్డి కూడా పార్టీ కండువా కప్పుకొన్నారు. ఆ వెంట నే జితేందర్‌రెడ్డిని క్యాబినెట్‌ ర్యాంకుతో కూడి న ప్రభుత్వ సలహాదారు (క్రీడా వ్యవహారాలు) పదవిలో, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతిని ధి పదవిలో ప్రభుత్వం నియమించింది. ఈ మేర కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కాగా నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ బీఆర్‌ఎ్‌సను వీడి బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.

Updated Date - Mar 16 , 2024 | 09:36 AM