Share News

ఎస్సార్‌ విద్యార్థుల జయకేతనం

ABN , Publish Date - Apr 26 , 2024 | 04:57 AM

జేఈఈ మెయిన్స్‌ ఫలితాల్లో ఎస్సార్‌ విద్యార్థులు జయకేతనం ఎగురవేశారని ఆ విద్యాసంస్థల చైర్మన్‌ ఎ.వరదారెడ్డి తెలిపారు. జాతీయ స్థాయిలో జి.నవీన్‌ 5వ ర్యాంకు, ఎ.నందిని 12, వై.సాత్విక్‌రెడ్డి 42,

ఎస్సార్‌ విద్యార్థుల జయకేతనం

వరంగల్‌ ఎడ్యుకేషన్‌, ఏప్రిల్‌ 25: జేఈఈ మెయిన్స్‌ ఫలితాల్లో ఎస్సార్‌ విద్యార్థులు జయకేతనం ఎగురవేశారని ఆ విద్యాసంస్థల చైర్మన్‌ ఎ.వరదారెడ్డి తెలిపారు. జాతీయ స్థాయిలో జి.నవీన్‌ 5వ ర్యాంకు, ఎ.నందిని 12, వై.సాత్విక్‌రెడ్డి 42, జి.కాలు 55 వ ర్యాంకు సాధించగా, మరో 12 మంది విద్యార్థులు 100 నుంచి 300 లోపు ర్యాంకులు సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. 2024 జేఈఈ మెయిన్స్‌ ఫలితాల్లో ఎస్సార్‌ విద్యాసంస్థలకు చెందిన 3,256 మంది విద్యార్థులు అర్హత సాధించడం ఎస్సార్‌ విద్యాసంస్థల పేరు ప్రఖ్యాతులను పెంచిందన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్లు మధుకర్‌రెడ్డి, సంతో్‌షరెడ్డితో కలిసి వరదారెడ్డి విద్యార్థులను అభినందించారు.

Updated Date - Apr 26 , 2024 | 04:57 AM