Share News

రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేస్తా

ABN , Publish Date - Apr 06 , 2024 | 03:38 AM

పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా తాను రాష్ట్రమంతా పర్యటించి కాంగ్రెస్‌ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేస్తానని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డి సమీపంలోని మల్కాపూర్‌లోని ఓ

రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేస్తా

మెదక్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలి.. సంగారెడ్డిలో 20 వేల మెజార్టీ రావాలి

ఇక్కడ నా సతీమణి నిర్మల ప్రచారం చేస్తారు.. .. రాజకీయ కొట్లాటలకు పోవద్దు: జగ్గారెడ్డి

సంగారెడ్డి/కొండాపూర్‌, ఏప్రిల్‌ 5, (ఆంధ్రజ్యోతి): పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా తాను రాష్ట్రమంతా పర్యటించి కాంగ్రెస్‌ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేస్తానని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డి సమీపంలోని మల్కాపూర్‌లోని ఓ ఫంక్షన్‌హాలులో శుక్రవారం జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు నిర్మలాజగ్గారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్‌ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. కాంగ్రెస్‌ మెదక్‌ ఎంపీ అభ్యర్థి అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలను పిలుపునిచ్చారు. తన సతీమణి, టీఎ్‌సఐఐసీ చైర్‌పర్సన్‌ నిర్మల సంగారెడ్డి నియోజకవర్గంలో ప్రచారం చేస్తుందన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థికి సంగారెడ్డి నియోజకవర్గంలో 20 వేల మెజార్టీ వచ్చేలా కృషిచేయాలని కార్యకర్తలను కోరారు. తాను వచ్చినా, రాకపోయినా కార్యకర్తలకు తన అండ ఉంటుందని చెప్పారు. కంది మండలంలోని ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటుపరం కానివ్వబోమన్నారు. కోడ్‌ ముగియగానే సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌, సీతక్క, రాజనర్సింహలను కలిసి నియోజకవర్గానికి కావలసిన నిధులు తెచ్చే బాధ్యత తనదేనని ఆయన చెప్పారు. నియోజక అభివృద్ధికి ఎమ్మెల్యే ప్రొటోకాల్‌కు అడ్డుపడొద్దని, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా మెలగాలని జగ్గారెడ్డి సూచించారు. ఓట్లు వేసేటప్పుడు లేని పౌరుషం ఇప్పుడెందుకు వస్తుందన్నారు. మన ప్రభుత్వమే ఉందని, పనులు కాకపోతే తన పేరు చెప్పి చేయించుకోవాలని సూచించారు. అధికారులు చేయకపోతే తన సంగతి ఎట్లా ఉంటుదో వారికి తెలుసన్నారు. తాను ఎన్ని నిధులు తెచ్చినా, కొబ్బరికాయ కొట్టే చాన్స్‌ తనకు లేదు కదా అని వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో రాజకీయ కొట్లాటలు తీసుకురావద్దని సూచించారు.

Updated Date - Apr 06 , 2024 | 03:38 AM