అది మనల్ని కాపాడుతుంది
ABN , Publish Date - Jun 01 , 2024 | 11:18 PM
సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తే, అది మనల్ని రక్షిస్తుందని బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ అ న్నారు.
- ప్రవచన కార్యక్రమంలో సామవేదం షణ్ముఖ శర్మ
జడ్చర్ల, జూన్ 1 : సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తే, అది మనల్ని రక్షిస్తుందని బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ అ న్నారు. జడ్చర్ల పట్టణంలోని చంద్రా గార్డెన్స్‌లో శ్రీహనుమాన్ జయంతి మ హోత్సవం సందర్భంగా నిర్వాహకు లు, తెలంగాణ రాష్ట్ర సంగీత, నాటక అకాడ మీ మాజీ చైర్మన్ బాద్మి శివకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమం లో పాల్గొని ఆయన ప్రవచనాలు చేశా రు. ప్రవచన కార్యక్రమం ప్రారంభ సం దర్భంగా పూజా కార్యక్రమం నిర్వహిం చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ధర్మమే అన్నింటికీ మూలమని, ధర్మాన్ని ప్రతీ ఒక్కరు పాటించాలని సూచించారు. ధర్మ ప్రవచనాలను వినాలని, దీంతో ఆధ్యాత్మికపై ఆసక్తి కలుగుతుందన్నారు. రామ అనే అక్షరంలోనే ఎంతో శక్తి ఉందని, ఆ శక్తి ప్రపంచమ యమైం దన్నారు. హనుమంతుడి జయంతి రోజున ప్రవచనాలు శక్తివంతంగా ఉంటాయ న్నారు. సంస్కృతి, సంప్రదాయాలను అనుసరించాలని సూచించారు. కార్యక్రమంలో నిర్వాహకులు బాదేపల్లి శంకర్‌బాబు, ముట్పూర్ రవీందర్, మంచన విఠలయ్య, వాసవి నర్సింములు, ఆలంపల్లి మనోహర్, వేణుగోపాల్, బెజగం గోపాలకృష్ణ, విజయ్‌కుమార్, కాలారు జనార్దన్, కుమారస్వామి, అమరవాది విశ్వనాథం, వేణుగోపాల్ ఝావర్, శివ్వరేఖ, పద్మలీల, స్థానికులు పాల్గొన్నారు.