Share News

సంగారెడ్డిలో ఐటీ దాడులు

ABN , Publish Date - May 02 , 2024 | 05:17 AM

సంగారెడ్డి మునిసిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ లత విజయేందర్‌రెడ్డి ఇంటితోపాటు మరికొందరు బీఆర్‌ఎస్‌ నాయకుల ఇళ్లల్లో

సంగారెడ్డిలో ఐటీ దాడులు

సంగారెడ్డి టౌన్‌, మే1: సంగారెడ్డి మునిసిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ లత విజయేందర్‌రెడ్డి ఇంటితోపాటు మరికొందరు బీఆర్‌ఎస్‌ నాయకుల ఇళ్లల్లో బుధవారం రాత్రి ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే, ఈ సోదాల్లో లత విజయేందర్‌రెడ్డి ఇంట్లో సుమారు రూ.70 లక్షలు దొరికినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ విషయమై ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌ విలేకర్లతో మాట్లాడుతూ... బీజేపీతో కలిస్తే జోడీ లే కుంటే ఈడీ, ఐటీ దాడులని అన్నారు. బీఆర్‌ఎస్‌ లోక్‌సభ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే తమ నాయకులపై బీజేపీ ఐటీ దాడులు చేయిస్తోందని ఆరోపించారు.

Updated Date - May 02 , 2024 | 05:17 AM