Share News

నా ఎంపికను వివాదం చేయడం సరికాదు: కోదండ

ABN , Publish Date - Jan 30 , 2024 | 03:35 AM

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీగా తన ఎంపికను వివాదం చేయడం సరికాదని టీజేఎస్‌ అధినేత కోదండరాం అన్నారు. రాజ్యాంగ పరంగా సామాజిక సేవ చేసిన వారికి అవకాశం ఇస్తారని, తాను తెలంగాణ

నా ఎంపికను వివాదం చేయడం సరికాదు: కోదండ

హైదరాబాద్‌, జనవరి 29(ఆంధ్రజ్యోతి): గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీగా తన ఎంపికను వివాదం చేయడం సరికాదని టీజేఎస్‌ అధినేత కోదండరాం అన్నారు. రాజ్యాంగ పరంగా సామాజిక సేవ చేసిన వారికి అవకాశం ఇస్తారని, తాను తెలంగాణ ఉద్యమంతోపాటు సుదీర్ఘకాలంగా అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నది అందరికీ తెలుసని చెప్పారు. ఈ అంశాన్ని పదేపదే వివాదం చేయడం సమంజసంకాదని సూచించారు. ఎమ్మెల్సీలుగా ఎంపికైన కోదండరాం, ఆమిర్‌ అలీఖాన్‌లు ప్రమాణ స్వీకారం చేసేందుకు సోమవారం శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి చాంబర్‌కు వెళ్లారు. ఉదయం 11.30 గంటలకు వెళ్లిన వారు రెండు గంటలపాటు ఎదురు చేసినా చైర్మన్‌ రాలేదు. చైర్మన్‌ గొంతు ఇన్‌ఫెక్షన్‌, జ్వరం కారణంగా రాలేకపోతున్నట్లు సమాచారం పంపారని అసెంబ్లీ కార్యదర్శి కార్యాలయ ఉద్యోగులు వెల్లడించారు. అయితే బీఆర్‌ఎస్‌ అధినాయకత్వం ఒత్తిడి మేరకే మండలి చైర్మన్‌ రావట్లేదన్న ప్రచారం కాంగ్రె్‌సవర్గాల్లో జరిగింది. అనంతరం మీడియాతో కోదండరాం మాట్లాడుతూ మంగళవారం ఉదయం 9.30 గంటలకు తమ ప్రమాణ స్వీకారానికి అవకాశం ఇవ్వాలని అధికారులను కోరినట్లు చెప్పారు.

Updated Date - Jan 30 , 2024 | 10:38 AM