అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు
ABN , Publish Date - Feb 06 , 2024 | 11:07 PM
ముఖ్యమంత్రి రేవం త్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ నా యకులు దహనం చేశారు.
- మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్
దిష్టిబొమ్మను దహనం చేసిన కాంగ్రెస్ నాయకులు
- పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు
మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 6: ముఖ్యమంత్రి రేవం త్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ నా యకులు దహనం చేశారు. మంగళవారం తెలంగాణ చౌరస్తాలో బాల్కసుమన్ దిష్టిబొమ్మను దహనం చేసి న నాయకులు ఆయనపై తీవ్రస్థాయిలో మండిపడ్డా రు. కేసీఆర్ బూట్లునాకే కుక్క సుమన్ అని, అలాంటి వ్యక్తి సీఎంను ఇష్టానుసారంగా మాట్లాడితే సహిం చేది లేదన్నారు. ఉద్యమ ముసుగులో పదవులు అను భవించిన ఆయనను అసలైన ఉద్యమకారులు తరిమి కొట్టే సమయం వచ్చిందన్నారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తగిన బుద్ధి చెబుతామన్నారు. అనంత రం ఆయనపై టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసిన నాయకులు చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాం గ్రెస్ నాయకులు ప్రవీణ్‌కుమార్, మాచన్‌పల్లిరాజు, రవికిరణ్, గడ్డమీది గోపాలకృష్ణ, మిట్ట నర్సింహ, రామకృష్ణ, రాజశేఖర్, వెంకట్రాములు పాల్గొన్నారు.
భూత్పూర్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సమజసం కాదని, ఆయనను వెంటనే అరెస్టు చేయాలని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కేసీరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి కోరారు. మంగళవారం భూత్పూర్ పోలీస్‌స్టేషన్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం స్థానిక విలేకర్లతో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ బీఆర్‌ఎస్ నాయకులు పదవులు పోగొట్టుకొని మతి తప్పి మాట్లాడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రజలే తిరగబడి తరమి...తరమి కొడతారని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటనర్సింహా రెడ్డి, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భూపతిరెడ్డి, నాయకులు రఘుపతిరెడ్డి, మాజీ సర్పంచ్ హర్యానాయక్, గోవర్ధన్‌గౌడ్, లక్ష్మీకాంత్‌రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ మాసగౌడ్, సురేష్‌గౌడ్, తమ్మన్నగౌడ్ పాల్గొన్నారు.
హన్వాడ : మాజీ ఎమ్యెల్యే బాల్కసుమన్‌ను వెంటనే అరెస్టు చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం కాంగ్రెస్ మండల నాయకులు పో లీసు స్టేషన్‌లో, తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కృష్ణ య్య, నాయకులు షబ్బీర్‌హుసేన్, నర్సిములు, యాదవరెడ్డి, వి కృష్ణ య్య, బొక్కిరాములు, వెంకటయ్య, లింగంనాయక్, నవనీత పాల్గొన్నారు.
మిడ్జిల్: మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంగళవారం బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రేవంత్ రె డ్డిని విమర్శించేస్థాయి బాల్క సుమన్‌కు లేద న్నా రు. నోటికి వచ్చినట్లుగా మాట్లాడితే ఖబర్దార్ అని హెచ్చ రించారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.
రాజాపూర్: మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధికార ప్రతినిధి దుశ్యాంత్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కృష్ణయ్య, నాయకులు నరహరి, రమేష్, రమణ, యాదయ్య, గోవర్ధన్ రెడ్డి, విక్రమ్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, శేఖర్ గౌడ్ పాల్గొన్నారు.