దందా బాగా నడుస్తుందా...!
ABN , Publish Date - Nov 28 , 2024 | 11:57 PM
అంతా బాగుందా..? దందా బాగా నడుస్తుందా.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దుకాణదారులను ఆప్యాయంగా ప లకరించారు.

దందా బాగా నడుస్తుందా...!
దుకాణదారులను ఆప్యాయంగా పలకరించిన మంత్రి వెంకట్‌రెడ్డి
వాటర్ బాటిల్ కొనుగోలు చేస్తున్న మంత్రి
నల్లగొండ, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): అంతా బాగుందా..? దందా బాగా నడుస్తుందా.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దుకాణదారులను ఆప్యాయంగా ప లకరించారు. మహాత్మాజ్యోతిరావు పూలే వర్ధంతి సం దర్భంగా గురువారం ఆయ న పట్టణంలోని క్లాక్‌టవర్ సెంటర్‌లోని పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం క్లాక్‌టవర్ సెంటర్‌లో పలు దుకాణదారుల వద్దకి వెళ్లి మోగక్షేమాలు తె లుసుకున్నారు. ఈ సందర్భంగా దుకాణదారుడు అక్కడ హైమాస్ట్ లైట్ కావాలని కోరారు. వెంటనే స్పందించిన ఆయన మునిసిపల్ కమిషనర్‌కి ఫోన చేయడంతో పాటు తనతోనే ఉన్న చైర్మన శ్రీనివా్‌సరెడ్డిని సమస్యను పరిష్కరించాలని సూచించారు. తక్షణమే ఒక లైట్ అక్కడ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సందర్భం గా పానషా్‌ప నిర్వాహకుడు మంత్రికి వాటర్ బాటిల్ అందజేశారు.