Share News

ఔషధ నియంత్రణ సంస్థకు ఇంటర్‌పోల్‌ అభినందన

ABN , Publish Date - Jan 21 , 2024 | 02:50 AM

తెలంగాణ ఔషధ నియంత్రణ సంస్థను ఇంటర్‌పోల్‌ అభినందించింది. నెల రోజులుగా డ్రగ్‌ కంట్రోల్‌ అఽధికారులు నకిలీ ఔషధాలపై ఉక్కుపాదం మోపారు. వివిధ రాష్ట్రాల నుంచి తెలంగాణకు వస్తోన్న నకిలీ ఔషధాలను వలపన్ని పట్టుకున్నారు.

ఔషధ నియంత్రణ సంస్థకు ఇంటర్‌పోల్‌ అభినందన

హైదరాబాద్‌, జనవరి 20(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఔషధ నియంత్రణ సంస్థను ఇంటర్‌పోల్‌ అభినందించింది. నెల రోజులుగా డ్రగ్‌ కంట్రోల్‌ అఽధికారులు నకిలీ ఔషధాలపై ఉక్కుపాదం మోపారు. వివిధ రాష్ట్రాల నుంచి తెలంగాణకు వస్తోన్న నకిలీ ఔషధాలను వలపన్ని పట్టుకున్నారు. ముఖ్యంగా దిగ్గజ ఔషధ కంపెనీలైన సన్‌ఫార్మా, గ్లెన్‌మార్క్‌, అరిస్టో ఫార్మాసూటికల్‌, టొరెంటో ఫార్మాల పేరుతో నకిలీ ఔషధాలను మార్కెట్లోకి తరలించేందుకు యత్నించిన ముఠాలను అధికారులు పట్టుకున్నారు. కాగా, ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో నకిలీ ఔషధ ముఠాలను ఇంటర్‌పోల్‌ పట్టుకుంది. తెలంగాణలో కూడా అదే తరహాలో నకిలీ ఔషఽధ ముఠాలపై ఉక్కుపాదం మోపుతోన్న విషయం ఆ సంస్థకు తెలిసింది. ఈనేపథ్యంలోనే ఈనెల 16న రాష్ట్ర డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్‌ జనరల్‌ కమలాసన్‌రెడ్డికి ఇంటర్‌పోల్‌ నుంచి లేఖ వచ్చింది. నకిలీ మందులను పట్టుకుంటున్నందుకు అభినందిస్తున్నట్లు అందులో పేర్కొంది. ఇదిలావుండగా... శనివారం మలక్‌పేట్‌లోని ఐశ్వర్య ఫర్టీలిటి సెంటర్‌లో ఔషధ నియంత్రణ సంస్థ నుంచి అనుమతులు పొందకుండా ఫార్మసీని నడుపుతున్నట్లు డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులకు సమాచారం అందడంతో షాపును సోదా చేశారు. నకిలీ ధృవపత్రాలతో షాపు నడుపుతున్నట్లు గుర్తించి, రూ.10లక్షల విలువైన ఔషధాలను అధికారులు సీజ్‌ చేశారు.

Updated Date - Jan 21 , 2024 | 09:52 AM