Share News

లక్ష కోట్ల వడ్డీలేని రుణాలిస్తాం

ABN , Publish Date - Apr 07 , 2024 | 04:07 AM

ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత అయిదు గ్యారెంటీలను అమలు చేస్తున్నామని, రాబోయే కాలంలో మహిళలకు రూ. లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు అందచేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగాగా

లక్ష కోట్ల వడ్డీలేని రుణాలిస్తాం

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడినపడుతోంది: భట్టి

తాగునీరు, సాగునీటి కొరత రాకుండా చూస్తాం: ఉత్తమ్‌

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి)/రంగారెడ్డి అర్బన్‌/మహేశ్వరం, ఏప్రిల్‌ 6: ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత అయిదు గ్యారెంటీలను అమలు చేస్తున్నామని, రాబోయే కాలంలో మహిళలకు రూ. లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు అందచేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగాగా తీర్చిదిద్దుతామన్నారు. తుక్కుగూడలో జరిగిన కాంగ్రెస్‌ జనజాతర సభలో ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రం ఆర్థిక, విద్యుత్‌ సంక్షోభంలో కూరుకుపోయిందని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలో ఆర్థిక సుడిగుండంలో చిక్కుకున్న రాష్ట్రాన్ని ఇపుడిపుడే గాడిలో పెడుతున్నామన్నారు. ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రాలను విడుదల చేశామని చెప్పారు. ఉద్యోగులందరికీ మొదటి తేదీకే జీతాలు చెల్లిస్తున్నామని ఆయన తెలిపారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో తాగు, సాగునీటి కొరత రాకుండా చూసే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని తెలిపారు. నాలుగు నెలల పాటు ఫామ్‌హౌ్‌్‌సలో పడుకున్న మాజీ సీఎం కేసీఆర్‌ ఇపుడు తమ ప్రభుత్వంపై బురదజల్లేయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఈ దుస్థితికి కేసీఆర్‌ ప్రభుత్వమే కారణమన్నారు. అధికారంలో ఉన్నప్పుడు గోదావరి, కృష్ణాజలాల విషయంలో అబద్ధాలు చెప్పి లూటీ చేశారని విమర్శించారు. కేసీఆర్‌ హయాంలో రాష్ట్రంలో వర్షాలు సరిగా పడలేదు.. వాటర్‌ మేనేజ్‌మెంట్‌ చేయలేదు.. మోసం లూటీ మాత్రం చేశారని ఆరోపించారు. కేసీఆర్‌ అబద్ధపు ప్రచారాలను కార్యకర్తలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పధాని మోదీ రాష్ట్రానికి చేసిందేమీ లేదని, బీజేపీకి ఓట్లు అడిగే అర్హతే లేదని ఆయన అన్నారు.

కేసీఆర్‌ను బహిరంగంగా ఉరితీసినా తప్పులేదు: సురేఖ

కుక్కల కొడుకుల్లారా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్న కేసీఆర్‌ను బహిరంగంగా ఉరితీసిన తప్పులేదని లేదని మంత్రి కొండా సురేఖ అన్నారు. కేసీఆర్‌ నోరు దగ్గర పెట్టుకోవాలని, లేదంటే లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ నుంచి పెద్ద ఎత్తున కాంగ్రె్‌సలో చేరుతున్నారని, త్వరలో బీఆర్‌ఎస్‌ పూర్తిగా ఖాళీ అవుతందని ఆమె అన్నారు.

వికసిత్‌ భారత్‌ ఏడుందయ్యా?: సీతక్క

వికసిత్‌ భారత్‌ ఏడుందయ్యా?.. విద్వేషపు కుట్రలతో విధ్వంసాలతో భారత్‌ను బందీ చేశారని ప్రధాని మోదీని ఉద్దేశించి మంత్రి సీతక్క ప్రశ్నించారు. బీజేపీ వాళ్లు ఈడీ కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. ఉదోగ్యాలు అడిగితే.. ఆయోధ్య రాముడిని చూపెడుతున్నారని విమర్శించారు.

కేసీఆర్‌.. నోరు అదుపులో పెట్టుకో..: పొన్నం

కేసీఆర్‌ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ హెచ్చరించారు. కేంద్రంలో నియంతృత్వ పాలన దేశ అభివృద్ధికి అడ్డంకిగా మారిందన్నారు. రాష్ట్రంలో 17 ఎంపీ సీట్లతో పాటు దేశంలోని కాంగ్రెస్‌ కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని, ఈ దిశగా పార్టీ శ్రేణులు కష్టపడాలని కోరారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు కలిసి రైతుల పేరిట డ్రామా చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.

కేసీఆర్‌ అవినీతికి రుజువు.. కవితే: జూపల్లి

కేసీఆర్‌ ఇంతకు నీది నోరా.. లేక మునిసిపాలిటా.. నీకు దొంగ బతుకు, లంగ బతుకు ఎందుకు. మంది సంసారాల్లో తొంగి చూడాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. మీరు చేసిన అవినీతికి రుజువు మీ బిడ్డ కవిత అని.. మీకు ఏమి రోగం వచ్చిందంటూ మండిపడ్డారు. రాహుల్‌ గాంధీని ప్రధాని చేయాల్సిన బాధ్యత మనందరిదన్నారు.

దేశంలో మార్పు కోసం కాంగ్రెస్‌ రావాలి: శ్రీధర్‌బాబు

దేశంలో మార్పు రావాలంటే కాంగ్రె్‌సను అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరముందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. రాష్ట్రంలో ఆరు గ్యారెంటీల్లో నాలుగింటిని అమలు చేస్తున్నామని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తామని పేర్కొన్నారు. కుల గణన అంశానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.

Updated Date - Apr 07 , 2024 | 04:07 AM