Share News

జిల్లాకు ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌

ABN , Publish Date - Nov 25 , 2024 | 01:10 AM

పేద, మద్య తరగతి విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యను అం దించాలనే లక్ష్యంతో సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న ఇండి యా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ఏర్పాటులో భా గంగా జగిత్యాల జిల్లాకు అవకాశం లభించింది.

జిల్లాకు ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌

- భవన నిర్మాణం కోసం రూ. 100 కోట్లు బడ్జెట్‌కు గ్రీన్‌ సిగ్నల్‌

5వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు అవకాశం

జగిత్యాల, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): పేద, మద్య తరగతి విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యను అం దించాలనే లక్ష్యంతో సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న ఇండి యా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ఏర్పాటులో భా గంగా జగిత్యాల జిల్లాకు అవకాశం లభించింది. ఇప్పటికే మొదటి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా పలు ఇంటిగ్రేటెడ్‌ రె సిడెన్షియల్‌ స్కూల్‌ మంజూరు చేసి భవన నిర్మాణ ప నులను గత నెలల ప్రభుత్వం ప్రారంభించింది. ప్రతీ అ సెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియ ల్‌ స్కూల్‌ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా ఇప్పటికే మొదటి విడత కింద రా ష్ట్రంలో 19 ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ పనులను ప్రభుత్వం ప్రారంభించగా, రెండో విడత కింద రాష్ట్ర వ్యా ప్తంగా 26 రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేయనున్నా రు. జగిత్యాల నియోజకవర్గంలో ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ను మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ స్కూల్‌ మంజూరుతో పేద, మ ద్య తరగతి విద్యార్థులకు కార్పొరేట్‌, అంతర్జాతీయ స్థా యి విద్య అందనుంది. సుమారు రూ. 100 కోట్ల నిధులతో త్వరలోనే స్కూల్‌ నిర్మాణ పనులు చేపట్టే అవ కాశాలు కనిపిస్తున్నాయి.

స్థల సేకరణకు కసరత్తులు..

జిల్లా కేంద్రంలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ భవన నిర్మాణానికి అవసరమైన కసరత్తులు జరుగుతు న్నాయి. ఇప్పటికే జిల్లా కేంద్రం సమీపంలో గల రెండు స్థలాలను గుర్తించి విద్యాశాఖకు అధికారులు నివేదించా రు. జిల్లా కేంద్రం సమీపంలోని చల్‌గల్‌ గ్రామంలో గల వాలంతరీ స్థలంలో భవన నిర్మాణం చేపట్టడానికి యోచి స్తున్నారు. జగిత్యాల రూరల్‌ మండలం గుట్రాజుపల్లి శి వారులో గల సుమారు 25 ఎకరాల ప్రభుత్వ స్థలంలో భవన నిర్మాణం చేసేందుకు పరిశీలన జరుగుతోంది. ఈ రెండు స్థలాలకు సంబంధించిన వివరాలను రాష్ట్ర స్థాయి అధికారులకు అందిస్తూ నివేదికలు వెళ్లాయి. ఇందులో చల్‌గల్‌ వాలంతరీ స్థలంలో స్కూల్‌ భవన నిర్మాణం జ రపడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు మొగ్గు చూపు తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అంతర్జాతీయ స్థాయిలో...

ప్రస్తుతం జిల్లాలో చాలా గురుకులాలకు శాశ్వత భవ నాలు లేవు. సగానికి పైగా గురుకుల పాఠశాలలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. పక్కా భవనం లేనప్పుడు బో దన, అభ్యసన కార్యక్రమాల అమలు ఇబ్బందికరంగా ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని బడుగు, బలహీన, మైనారిటీ వర్గాలకు ఒకే గొడుగు కిందకు తెచ్చి చదువు చెప్పించే లక్ష్యంతో సమీకృత గురుకులాలను ప్రభుత్వం నిర్మిస్తోంది. సుమారు 20 నుంచి 25 ఎకరాల్లో అంర్జాతీ య ప్రమాణాలతో భవనం నిర్మించనున్నారు. స్థానిక వా తావరణ పరిస్థితులకు అనుగుణంగా స్కూల్‌ నిర్మాణం జరుపనున్నారు. ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ నిర్మించే ప్రాంతం లో సుమారు పాతికేళ్ల క్రితం నుంచి అక్కడి ఉష్ణోగ్రత లు, వర్షాపాతం, చలి, వేడి గాలుల తీవ్రత తదితర వా తావరణ అంశాలను పరిశీలించి నిర్మించనున్నారు. విద్యా ర్థులకే కాకుండా బోధన, బోధనేత సిబ్బందికి అక్కడే క్వార్టర్స్‌ నిర్మించనున్నారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల పాఠశాలలన్నీ ఒకే ప్రాంగణంలోకి వస్తాయి. అయిదో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు విద్యార్థులుంటారు. ఈ స్కూల్‌ లో ఇంటర్నేషనల్‌ స్టాండర్స్‌తో ఇంగ్లీష్‌ మీడియం 12వ తరగతి వరకు బోధన అందించనున్నారు. రాష్ట్ర ప్రభు త్వం నిర్మించనున్న రెసిడెన్షియల్‌ స్కూల్‌లో సుమారు 2,560 మంది విద్యార్థులకు బోధన అందించే అవకాశం ఉంది. ఈ పాఠశాలల్లో వేర్వేరు బ్లాక్‌లు ఉండనున్నాయి. ప్రతీ స్కూల్‌లో 30 మంది చొప్పున 120 మంది ఉపా ధ్యాయులు పనిచేయనున్నారు. లైబ్రరీలో సుమారు 5 వేల పుస్తకాలు, 60 కంప్యూటర్లు ఉండనున్నాయి. అన్ని తరగతుల్లో డిజిటల్‌ బోర్డుల ద్వారా విద్యాబోధనలు చే యనున్నారు. ప్రతీ డార్మింటరీ గదిలో 10 బెడ్లు, రెండు బాత్‌ రూమ్‌లు ఉండే విదంగా ప్రణాళికలు రూపొందిం చారు. ఈ పాఠశాలలో చదువుల పేరిట ఒత్తిడి సృష్టించే వాతావరణం కాకుండా క్రీడలు, వినోదం వంటివి కూడా విద్యార్థులకు అందించనున్నారు.

అత్యాధునిక విద్యా ప్రమాణాలతో..

విద్యా ప్రమాణాలను మెరుగు పరచడం, పరిసరాల అవసరాలకు అనుగుణం గా యువ గ్రాడ్యుయేట్‌లు, నిరు ద్యోగుల నైపుణ్యాన్ని పెంపొందించే విదంగా అ త్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో ఈ ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలలో వి ద్యార్థులకు బోధన చేసే విధంగా ఏర్పాట్లు చేయనున్నారు. కార్పొరేట్‌ స్థాయి విద్యా బోధనలు అందించనున్నారు. అత్యాధునిక వసతులతో స్కూల్‌ను నిర్మించ నున్నారు. ఇంటి గ్రేటెడ్‌ క్యాంపస్‌లో తరగతి గదులు, డార్మెంటరీలు, ల్యాబరోట రీలే కాకుండా ఇండో స్పోర్ట్స్‌, క్రికెట్‌, ఫుట్‌ బాల్‌ మైదానాలు, బాస్కెట్‌ బాల్‌ మైదానం, అవు ట్‌డోర్‌ జిమ్‌, థియేటర్‌ వంటి సౌకర్యాలను కల్పించనున్నారు.

సీఎం రేవంత్‌ రెడ్డి సహకారాలతోనే..

డాక్టర్‌ మాకునూరి సంజయ్‌ కుమార్‌, ఎమ్మెల్యే, జగిత్యాల

జిల్లాలో ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ నిర్మాణం చేయనుండడం శుభపరిణామం. సీఎం రేవంత్‌ రెడ్డి సహాయ సహకారాలతోనే జగిత్యాలకు స్కూల్‌ మం జూరు అయింది. సుమారు 25ఎకరాల్లో సుమారు రూ. 100కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో భవనం నిర్మాణం జరపడానికి యోచిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఇప్పటికే జీవో జారీ అయిం ది. సంవత్సర కాలంలో నిర్మాణం పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాము.

Updated Date - Nov 25 , 2024 | 01:10 AM