Share News

Kumaram Bheem Asifabad- విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా

ABN , Publish Date - Sep 10 , 2024 | 11:17 PM

మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధ శుక్లా మంగళవారం అడిగి తెలుసుకున్నారు. సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధ శుక్లా వైరల్‌ జ్వరాలతో సామాజిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

Kumaram Bheem Asifabad-   విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా
వివరాలు తెలుసుకుంటున్న సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధ శుక్లా

సిర్పూర్‌(టి), సెప్టెంబరు 10: మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధ శుక్లా మంగళవారం అడిగి తెలుసుకున్నారు. సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధ శుక్లా వైరల్‌ జ్వరాలతో సామాజిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. సోమవారం ఎనిమిది మంది విద్యార్థులు చికిత్స తీసుకున్నారు. ఇందులో నలుగురికి జ్వరం తగ్గడంతో వారిని వసతి గృహానికి తరలించారు. మరో నలుగురు చికిత్స పొందుతుండడంతో మరో రెండు రోజుల పాటు వైద్యం అందించాలని డాక్టర్‌ అనూష, తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఎంపీడీవో సత్యనారాయణకు సూచించారు. అలాగే వసతి గృహంలో మ రో వారం రోజుల పాటు ఆరోగ్య శిబిరం నిర్వహించి అందరికి వైద్య పరీక్షలు నిర్వహించాల న్నారు. అనంతరం మండలంలోని నవేగాంలో లోనవెల్లి పీహెచ్‌సీ వైద్యురాలు డాక్టర్‌ నవత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో పారిశుధ్యం, మురికి కాలువల్లో బైటెక్స్‌ స్ర్పే, పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కార్యద ర్శిని ఆదేశించారు. అవసరం ఉన్న చోట వైద్య శిబిరం నిర్వహించాలలని సూచించారు. ఆమె వెంట ఎంపీడీవో సత్యనారాయణ, తహసీల్దార్‌ శ్రీనివాస్‌, గిర్దావర్‌ మోహన్‌, కార్యదర్శులు, వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.

Updated Date - Sep 10 , 2024 | 11:17 PM