Share News

తెలంగాణలో వాల్మీకులకు అన్యాయం

ABN , Publish Date - Jul 15 , 2024 | 11:24 PM

తెలంగాణ రాష్ట్రం లోని వాల్మీకులకు రాజకీయంగా తీవ్ర అన్యాయం జ రుగుతోందని ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి అ న్నారు.

 తెలంగాణలో వాల్మీకులకు అన్యాయం
సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ ఎమ్మెల్యే పార్థసారధి

- అధికారం మనదైనప్పుడే ఎస్టీ జాబితా సాధిస్తాం

- ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి

- అలంపూర్‌ నుంచి భారీ ర్యాలీ

- వాల్మీకి ప్రజాప్రతినిధుల సన్మాన సభ విజయవంతం

అలంపూర్‌ చౌరస్తా, జూలై 15: తెలంగాణ రాష్ట్రం లోని వాల్మీకులకు రాజకీయంగా తీవ్ర అన్యాయం జ రుగుతోందని ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి అ న్నారు. సోమవారం అలంపూర్‌ చౌరస్తాలో అలం పూ ర్‌ నియోజకవర్గంలోని మాజీ వాల్మీకి ప్రజాప్రతిని ధులకు ఐక్యవాల్మీకి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు క్యాతూరు మద్దిలేటి, ఎర్రవల్లి మాజీ ఎంపీటీసీ సభ్యు డు నీలి శ్రీనువాసులు ఆధ్వర్యంలో సన్మాన కార్యక్ర మాన్ని నిర్వహించారు. కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ మధుసూదన్‌నాయకుడు, గుంతకల్లు ఎమ్మె ల్యే గుమ్మనూరు జయరాములు, ఏపీ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహ కార్యదర్శి గుడిసె కిష్టమ్మ, ఏడీసీసీబీ మాజీ చైర్మన్‌ వీరంజనేయులు తదితర ముఖ్య నా యకులతో పాటు అలంపూర్‌ నియోజకవర్గంలో ఎని మిది మండలాల వాల్మీకి నాయకులు హాజరయ్యారు. మొదట అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం నీలి శ్రీనువాసులు ఆధ్వర్యంలో అలంపూర్‌ పట్టణం నుంచి అలంపూర్‌ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వ హించారు. చౌరస్తాలో వంద అడుగుల గజమాలను క్రేన్‌ సాయంతో ముఖ్యఅథితులకు అలంకరించారు. అనంతరం ఏజేఆర్‌ ఫంక్షన్‌హాల్‌లో మాజీ ప్రజా ప్ర తినిధులను సన్మానించారు. అంతకుముందు ఎమ్మె ల్యే పార్థసారధి మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా రెండుతెలుగు రాష్ర్టాలలోనే వాల్మీకులు బీసీఏలుగా ఉన్నారనే విషయాన్ని ఇటీవల ఎన్నికల ప్రచారంలో మన ప్రధానమంత్రి మోదీకి చెప్పగా, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారని అన్నారు. తప్పకుండా వాల్మీకులకు న్యాయం చేస్తానని మోదీ హామీ ఇచ్చారని అన్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు ఆరు లక్షల ఓట్లు ఉన్న వాల్మీకులకు టికెట్‌ ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. ఇక నుంచి టికెట్‌ ఇవ్వని పార్టీలను ఓడించాలని, టికెట్‌ రాకున్న వచ్చే స్థానిక ఎన్నికల్లో ఇండిపెండెంట్లుగా వాల్మీకులు పోటీచేయా లని, అందరు ఏకమై మనవాడిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.

జగన్‌కు సవాల్‌ విసిరి వైసీపీ నుంచి బయటకు వచ్చా

వాల్మీకులు, టీడీపీ కార్యకర్తల బలంతో మళ్లీ ఎమ్మెల్యే అవుతానని జగన్‌కు సవాల్‌ విసిరి వైసీపీ నుంచి బయటకు వచ్చానని గుంతకల్లు ఎ మ్మెల్యే గుమ్మనూరు జయరాములు అన్నారు. ఏపీలో వాల్మీకులంతా ఐక్యంగా ఉండబట్లే అన్ని పార్టీలు గౌరవించి టికెట్లు ఇస్తున్నాయని అది తెలంగాణలో జరగడం లేదన్నారు. వాల్మీకులు ఐక్యంగా ఉన్నప్పుడే పార్టీలు మనల్ని గుర్తిస్తాయని లేదంటే ఓట్లకు మాత్రమే వాడుకుని వదిలేస్తారని అన్నారు. కత్తి వదిలి కలం పట్టిన వాల్మీకి మహర్షే మనకు ఆదర్శ మని, అందరు చదువుకున్నప్పుడే మనజీవితాలు మా రుతాయని ఏపీ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహ కార్యదర్శి గడిసె కిష్టమ్మ అన్నారు. బోయలంతా ఏకమైతే నడిగడ్డలో 1.25లక్షల ఓట్లు ఉన్న మనమే ఎమ్మెల్యేలు కావచ్చని ఎర్రవల్లి ఎంపీటీసీ మాజీ సభ్యుడు నీలి శ్రీనువాసులు అన్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో అన్ని అవకాశం ఉన్న గ్రామాలలో పోటీ చేయాలని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు క్యాతూరు మ ద్దిలేటి అన్నారు. సమావేశంలో దాదాపు పదివేలమంది వాల్మీకులు పాల్గొన్నారు.

Updated Date - Jul 15 , 2024 | 11:24 PM