Share News

చెంచులకు మౌలిక సదుపాయాలు

ABN , Publish Date - Jan 03 , 2024 | 10:33 PM

గిరిజనుల జీవితాలను మెరుగుపరిచేందుకు కేంద్రం పీఎం జన్మాన్‌ పథకాన్ని ప్రవేశపెట్టిందని కలెక్టర్‌ నారాయణరెడ్డి పేర్కొన్నారు. పెద్దేముల్‌ మండలం చైతన్యనగర్‌లో బుధవారం ఈపథకం కింద పొందాల్సిన సౌకర్యాలపై కలెక్టర్‌ చెంచుకుటుంబాలతో సమావేశం నిర్వహించారు.

చెంచులకు మౌలిక సదుపాయాలు
చైతన్యనగర్‌లో గిరిజనులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ నారాయణరెడ్డి

ప్రస్తుత సదుపాయాలపై ఆరా తీసిన కలెక్టర్‌

పెద్దేముల్‌, జనవరి 3: గిరిజనుల జీవితాలను మెరుగుపరిచేందుకు కేంద్రం పీఎం జన్మాన్‌ పథకాన్ని ప్రవేశపెట్టిందని కలెక్టర్‌ నారాయణరెడ్డి పేర్కొన్నారు. పెద్దేముల్‌ మండలం చైతన్యనగర్‌లో బుధవారం ఈపథకం కింద పొందాల్సిన సౌకర్యాలపై కలెక్టర్‌ చెంచుకుటుంబాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వికారాబాద్‌ జిల్లాలో 22 గ్రామాలు ఉన్నాయని, వాటిలో 776 కుటుంబాలు నివాసం ఉంటున్నారని తెలిపారు. 11 ముఖ్యమైన కనీస సౌకర్యాలను సూచిస్తూ అవి అందరికీ ఉన్నాయా లేదా అని చెంచులను అడగగా ఏసౌకర్యాలు లేవని చెప్పారు. పీఎం జన్మాన్‌ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి వారం రోజుల్లో అన్ని సౌకర్యాలు అందే విధంగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, గురువారం నుంచి ఆయా గ్రామాల్లో యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. కలెక్టర్‌ ఆదేశాను సారం బుధవారం నుంచే చైతన్యనగర్‌లో ఆధార్‌సెంటర్‌ ఏర్పాటు చేసి కార్డులజారీ, అప్‌డేట్‌ పనులు మొదలుపెట్టారు. ఈకార్యక్రమంలో సర్పంచ్‌ పి.లలిత, డీటీడబ్ల్యువో కోటాజి, ఏడీఏ గోపాల్‌, డీఈవో రేణుక, జిల్లా సంక్షేమాధికారి లలితకుమారి, డీఎంహెచ్‌వో పాల్వన్‌కుమార్‌, బాబు, శ్రీనివాస్‌, తహశీల్దారు కిషన్‌, వైద్యులు బుచ్చిబాబు, ఆర్‌ఐ.రాజిరెడ్డి, ఏఈవో బాలకోటేశ్వర్‌రావు, పంచాయతీ కార్యదర్శి నాగరాణి తదితరులు పాల్గొన్నారు. కాగా పెద్దేముల్‌ మండలం బుద్దారం గ్రామంలో ప్రజాపాలన సదస్సులో కలెక్టర్‌ దరఖాస్తుల స్వీకరణను పరిశీలించారు. ఆరు గ్యారంటీలు కాకుండా సాధారణ దరఖాస్తులు చేసుకున్న వారికి అధికారులు రశీదులు ఇవ్వడం లేదు. దీంతో కలెక్టర్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.వెంటనే దరఖాస్తు చేసుకున్న వారందరికి రశీదులు ఇవ్వాలని ఆదేశించారు.

Updated Date - Jan 03 , 2024 | 10:33 PM