Share News

ఆర్టీసీలో తొలగించిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోండి :కూనంనేని

ABN , Publish Date - Apr 03 , 2024 | 02:44 AM

చిన్న చిన్న తప్పులను కారణాలుగా చూపి గత ప్రభుత్వం ఆర్టీసీలో సుమారు 1500 మంది ఉద్యోగులను తొలగించిందని,

ఆర్టీసీలో తొలగించిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోండి :కూనంనేని

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): చిన్న చిన్న తప్పులను కారణాలుగా చూపి గత ప్రభుత్వం ఆర్టీసీలో సుమారు 1500 మంది ఉద్యోగులను తొలగించిందని, వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లుగా పని చేస్తున్న వారిని స్వల్ప కారణాలతో ఉద్యోగాల నుంచి తొలగించారని, వారిని తిరిగి విధుల్లోకి తీసుకుని ఆయా కుటుంబాలకు అండగా నిలవాలని కూనంనేని కోరారు.

Updated Date - Apr 03 , 2024 | 08:23 AM