Share News

మే 1 నుంచి నిరవధిక సమ్మె

ABN , Publish Date - Mar 01 , 2024 | 04:25 AM

పాత పింఛన్‌ పథకం(ఓపీఎ్‌స)ను పునరుద్ధరించకుంటే కార్మిక దినోత్సవం(మే 1) నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి.

మే 1 నుంచి నిరవధిక సమ్మె

ఓపీఎస్‌ పునరుద్ధరణకు ఉద్యోగ సంఘాల డిమాండ్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 29: పాత పింఛన్‌ పథకం(ఓపీఎ్‌స)ను పునరుద్ధరించకుంటే కార్మిక దినోత్సవం(మే 1) నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి. ఉద్యోగ సంఘాలు, అసోసియేషన్లు కలిసి దీనికోసం జేఎ్‌ఫఆర్‌వోపీఎ్‌స(ది జాయింట్‌ ఫోరం ఫర్‌ రీస్టోరేషన్‌ ఆఫ్‌ ఓల్డ్‌ పెన్షన్‌ స్కీం)గా ఏర్పడ్డాయి. మార్చి 19 నుంచే సమ్మె నోటీసులు ఇవ్వడం ప్రారంభిస్తామని జేఎ్‌ఫఆర్‌వోపీఎస్‌ కన్వీనర్‌ శివ్‌ గోపాల్‌ మిశ్రా గురువారం ఓ ఆంగ్ల పత్రికకు తెలిపారు. కాగా, ఓపీఎస్‌ స్థానంలో ప్రభుత్వం ఎన్‌పీఎస్‌(జాతీయ పింఛన్‌ పథకం)ను అమల్లోకి తీసుకొచ్చింది. ఎన్‌పీఎస్‌ కింద ఉద్యోగి మూల వేతనంలో 10 శాతాన్ని, అలాగే ప్రభుత్వం నుంచి మరో 14 శాతాన్ని పింఛన్‌ నిధికి జమచేస్తారు. ఆ నిధులను వివిధ రూపాల్లో పెట్టుబడులు పెడతారు. ఉద్యోగి రిటైర్మెట్‌ ప్రయోజనాలు ఈ పెట్టుబడులపైనే ఆధారపడి ఉంటాయి. ఎన్‌పీఎస్‌ అనేది రిటైరయ్యే ఉద్యోగుల పాలిట శాపంగా మారిందని జేఎ్‌ఫఆర్‌వోపీఎస్‌ కన్వీనర్‌ శివ్‌ గోపాల్‌ మిశ్రా విమర్శించారు. ఓపీఎ్‌సను పునరుద్ధరించాలని చర్చల్లో అనేకసార్లు డిమాండ్‌ చేశామని, కేంద్ర ప్రభుత్వానికి లేఖలు కూడా రాశామని చెప్పారు. కాగా, ఓపీఎ్‌సను పునరుద్ధరించే ఆలోచన ఏమీ లేదని గతేడాది డిసెంబరులో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది.

Updated Date - Mar 01 , 2024 | 09:51 AM