Share News

వంతెన ఎత్తు పెంచండి

ABN , Publish Date - Apr 14 , 2024 | 11:54 PM

భారత్‌ మాల పనులలో భాగంగా రాజోలి నుంచి శాంతినగర్‌కు వెళ్లే ప్రధాన దారిపై ఆరు లైన్‌ల వంతెన ఎత్తు పెంచా లని నాగర్‌కర్నూల్‌ ఎంపీ రా ములు అధికారులను ఆదే శించారు.

వంతెన ఎత్తు పెంచండి
గ్రామస్థులతో మాట్లాడుతున్న ఎంపీ రాములు

- రైతులకు ఇబ్బందులు కలగకూడదు

- నాగర్‌కర్నూల్‌ ఎంపీ పి. రాములు

రాజోళి, ఏప్రిల్‌ 14: భారత్‌ మాల పనులలో భాగంగా రాజోలి నుంచి శాంతినగర్‌కు వెళ్లే ప్రధాన దారిపై ఆరు లైన్‌ల వంతెన ఎత్తు పెంచా లని నాగర్‌కర్నూల్‌ ఎంపీ రా ములు అధికారులను ఆదే శించారు. వంతెన ఎత్తు తక్కువగా ఉంటుందని రైతు లు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రైతుల సమస్యపై ‘ఆంధ్రజ్యోతి’లో ‘తక్కువ ఎత్తులో వంతెన ’ అనే శీర్షిక కథనం ప్రచురితం కాగా ఆదివారం ఎంపీ రాము లు, బీజేపీ ఎంపీ అభ్యర్థి భరత్‌ ప్రసాద్‌, మండల నాయకులతో కలిసి వంతెన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడున్న రైతు లు తమ సమస్యను ఎకరువు పెట్టారు. ఎంపీ రాములు ఫోన్‌లో కలెక్టర్‌ బీఎం. సంతోష్‌తో, భారత్‌మాల ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ హిమాన్స్‌ గుప్తాతో మాట్లాడి వెంటనే పనులను నిలివేయాలని ఆదేశించారు. వంతెన ఎత్తు పెంచితేనే రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. సమస్యపై సం బంధిత మంత్రి నితిన్‌ గడ్కరీకి ఫ్యాక్స్‌ ద్వారా లేఖ పం పినట్లు అంతవరకు పనులు చేపట్టవద్దని ఎంపీ రాములు కోరారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు సంజీవ రెడ్డి, మాజీ ఉప సర్పంచు గోపాల్‌, మాజీ ఎంపీటీసీ సభ్యుడు గంగిరెడ్డి,కాంగ్రెస్‌ నాయకులు దస్తగిరి, రషీద్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 14 , 2024 | 11:54 PM