Share News

కాంట్రాక్టు సిబ్బంది పదవీ విరమణ వయసు పెంపు

ABN , Publish Date - Apr 30 , 2024 | 04:36 AM

ఇంటర్మీడియట్‌ బోర్డులోని కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది పదవీవిరమణ వయసును 61 ఏళ్లకు పెంచుతూ విద్యా శాఖ కార్యదర్శి బుర్రా

కాంట్రాక్టు సిబ్బంది పదవీ విరమణ వయసు పెంపు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ బోర్డులోని కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది పదవీవిరమణ వయసును 61 ఏళ్లకు పెంచుతూ విద్యా శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు ఆ సిబ్బంది పదవీవిరమణ వయసు 58 ఏళ్లుగా ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీవిరమణ వయసును 61 ఏళ్లకు పెంచడంతో కొంతమంది కాంట్రాక్టు సిబ్బంది కోర్టుకు వెళ్లారు. దాంతో కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది పదవీవిరమణ వయసును కూడా 61 ఏళ్లకు పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయం కేవలం కోర్టుకు వెళ్లిన వారికే వర్తిస్తుందా లేక అందరికా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.

Updated Date - Apr 30 , 2024 | 04:36 AM