Share News

భద్రాద్రి రామాలయ ప్రత్యేక పోస్టల్‌ కవర్‌ ఆవిష్కరణ

ABN , Publish Date - Jan 29 , 2024 | 03:48 AM

భద్రాద్రి రామాలయ ప్రత్యేక పోస్టల్‌ కవర్‌ను డాక్‌ సదన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి దేవ్‌సిన్హ్‌ చౌహాన్‌ ఆవిష్కరించారు.

భద్రాద్రి రామాలయ ప్రత్యేక పోస్టల్‌ కవర్‌ ఆవిష్కరణ

రాష్ట్రంలో 6,266 పోస్టాఫీసులతో 4 కోట్ల మందికి సేవలు

కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి దేవ్‌సిన్హ్‌ చౌహాన్‌

హైదరాబాద్‌, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): భద్రాద్రి రామాలయ ప్రత్యేక పోస్టల్‌ కవర్‌ను డాక్‌ సదన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి దేవ్‌సిన్హ్‌ చౌహాన్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో సైతం దేశ వ్యాప్తంగా పల్లె, పట్టణాల్లో సేవలు అందించిన ఏకైక సంస్థ తపాలా శాఖ అని గుర్తుచేశారు. తెలంగాణలో 6,266 పోస్టాఫీసుల ద్వారా 4.01 కోట్ల మంది ప్రజలకు సేవలు అందిస్తున్నట్టు వివరించారు. దేశ వ్యాప్తంగా 66 వేల పోస్టాఫీసులున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సర్కిల్‌ చీఫ్‌ పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ డాక్టర్‌ పీవీఎస్‌. రెడ్డి, స్థానిక కార్పొరేటర్‌ సురేఖ, హైదరాబాద్‌ రీజియన్‌ పీఎంజీ శ్రీతల, డీపీఎస్‌ దేవరాజ్‌, ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి జొన్నలగడ్డ స్నేహజ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 29 , 2024 | 07:13 AM