Share News

ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల వద్దకే పాలన

ABN , Publish Date - Apr 24 , 2024 | 11:38 PM

ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల వద్దకే పాలన అందించాలనే సం కల్పంతో వనపర్తి నియోజకవర్గంలోని అన్ని మం డల కేంద్రాల్లో ఎమ్మెల్యే క్యాంపు బ్రాంచ్‌ కార్యాల యాలు రాబోయే రోజుల్లో ప్రారంభిస్తామని ఎమ్మె ల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు.

 ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల వద్దకే పాలన
క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మేఘారెడ్డిని సన్మానిస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

- వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి

- ఖిల్లాఘణపురం క్యాంపు కార్యాలయం ప్రారంభం

ఖిల్లాఘణపురం, ఏప్రిల్‌ 24: ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల వద్దకే పాలన అందించాలనే సం కల్పంతో వనపర్తి నియోజకవర్గంలోని అన్ని మం డల కేంద్రాల్లో ఎమ్మెల్యే క్యాంపు బ్రాంచ్‌ కార్యాల యాలు రాబోయే రోజుల్లో ప్రారంభిస్తామని ఎమ్మె ల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. బుధవారం మండల కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు బ్రాంచ్‌ కార్యాలయంలో పూజలు ప్రారంభించారు. కాంగ్రెస్‌ నాయకులు ఎమ్మెల్యేను శాలువాలతో సత్కరించా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజ లు తనను కలిసేందుకు ఇబ్బందులు పడుతూ ని యోజకవర్గ కేంద్రానికి రావాల్సిన అవసరం లేకుం డా వారంలో ఒక రోజు మండలంలోని బ్రాంచ్‌ క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉంటాన ని తెలిపారు. ప్రజల చెంతకే పాలన అందించడా నికి కాంగ్రెస్‌ ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉందన్నారు. బ్రాంచ్‌ కార్యాలయాల్లో కల్యాణ లక్ష్మి, సీఎం రిలీఫ్‌ ఫండ్‌ లాంటి పత్రాలను ప్రజ లు అందజేయడానికి అందుబాటులో ఉండటానికి కార్యాలయంలో ఒక ఉద్యోగిని నియమిస్తామని, కంప్యూటర్‌ను ఏర్పాటు చేసి ప్రభుత్వసాయం కోసం పత్రాలను అప్‌లోడ్‌ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వెంకటయ్య , జడ్పీటీసీ మాజీ సభ్యుడు తినేటి రవీందర్‌ రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ మురళీధర్‌ రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు విజయలక్ష్మి, ఓమేష్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు విజయ్‌ కుమార్‌, దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు గంజాయి రమేష్‌, నాయకులు సాయిచరణ్‌ రెడ్డి, మర్యాద రామకృష్ణారెడ్డి, నరేంద ర్‌ గౌడ్‌, సొన్నతి రమేష్‌, ప్రకాష్‌, కృష్ణయ్య యాద వ్‌, మునగాల బాబు, నరసింహారెడ్డి, లింగస్వామి, దేవుజా, రవి నాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 24 , 2024 | 11:38 PM