Share News

సీబీఎస్‌ఈ టెన్త్‌ ఫలితాల్లో.. శ్రీ చైతన్య ప్రభంజనం

ABN , Publish Date - May 15 , 2024 | 02:49 AM

సీబీఎ్‌సఈ పదో తరగతి ఫలితాల్లో తమ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని శ్రీచైతన్య విద్యా సంస్థల డైరెక్టర్‌ సీమ తెలిపారు. శ్రీ చైతన్య స్కూల్‌ విద్యార్థి

సీబీఎస్‌ఈ టెన్త్‌ ఫలితాల్లో.. శ్రీ చైతన్య ప్రభంజనం

హైదరాబాద్‌, మే 14 (ఆంధ్రజ్యోతి): సీబీఎ్‌సఈ పదో తరగతి ఫలితాల్లో తమ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని శ్రీచైతన్య విద్యా సంస్థల డైరెక్టర్‌ సీమ తెలిపారు. శ్రీ చైతన్య స్కూల్‌ విద్యార్థి 496 మార్కులతో ఆలిండియా నంబర్‌ వన్‌గా నిలిచారని చెప్పారు. అలాగే.. 495 మార్కులను ఇద్దరు విద్యార్థులు సాధించారని పేర్కొన్నారు. 8 మంది విద్యార్థులు 494 మార్కులను, 19 మంది విద్యార్థులు 493 మార్కులను, 61 మంది 490 మార్కులకు పైగా, 532 మంది విద్యార్థులు 480 మార్కులకు పైగా, 1259 మంది విద్యార్థులు 470కు పైగా మార్కులను సాధించారని వెల్లడించారు. మొత్తంగా తమ సంస్థలోని 92 శాతం బ్రాంచీలు 100 శాతం ఉత్తీర్ణతను సాధించినట్టు తెలిపారు.

Updated Date - May 15 , 2024 | 09:39 AM