Share News

అమెరికా ఎన్‌ఎస్‌ఎస్‌ స్పేస్‌ కాంటె్‌స్టలో.. ప్రపంచ చాంపియన్‌గా శ్రీచైతన్య

ABN , Publish Date - Apr 04 , 2024 | 05:05 AM

అమెరికా ఎన్‌ఎస్‌ఎస్‌ స్పేస్‌ కాంటె్‌స్ట-2024లో శ్రీచైతన్య వరుసగా పదకొండోసారి వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచింది. ఈ పోటీలో మొత్తం 28కి పైగా దేశాలు పాల్గొనగా అందులో తమ సంస్థ విద్యార్థులు

అమెరికా ఎన్‌ఎస్‌ఎస్‌ స్పేస్‌ కాంటె్‌స్టలో.. ప్రపంచ చాంపియన్‌గా శ్రీచైతన్య

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): అమెరికా ఎన్‌ఎస్‌ఎస్‌ స్పేస్‌ కాంటె్‌స్ట-2024లో శ్రీచైతన్య వరుసగా పదకొండోసారి వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచింది. ఈ పోటీలో మొత్తం 28కి పైగా దేశాలు పాల్గొనగా అందులో తమ సంస్థ విద్యార్థులు నంబర్‌ వన్‌ స్థానంలో నిలిచారని శ్రీచైతన్య డైరెక్టర్‌ సీమ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కాంటె్‌స్టలో 3 క్యాష్‌ అవార్డులను ఎన్‌ఎ్‌సఎస్‌ ప్రకటించగా అందులో 2 అవార్డులను వరుసగా రెండో సంవత్సరం కూడా శ్రీచైతన్య సాధించిందని తెలిపారు. ఇప్పటి వరకు ఈ ఘనతను ఎవరూ సాధించలేదని పేర్కొన్నారు. అలాగే వరల్డ్‌ ఒకటి, రెండు, మూడు ప్రైజ్‌లలో గానీ, విన్నింగ్‌ ప్రాజెక్టుల సంఖ్యలో, విజయం సాధించిన విద్యార్థుల సంఖ్యలో, క్యాష్‌ అవార్డుల్లో గానీ భారతదేశంతోపాటు ప్రపంచంలోనే మరే ఇతర విద్యా సంస్థ తమ సంస్థ ఫలితాలకు దరిదాపుల్లోలేదని ఆమె తెలిపారు. ఈ ఫలితాలే శ్రీ చైతన్య స్కూల్‌ను ప్రపంచంలోనే నంబర్‌ 1గా నిలిపాయన్నారు.

Updated Date - Apr 04 , 2024 | 08:29 AM