Share News

3వారాల్లో రూ. 49 కోట్లు పట్టుబడింది:పోలీసులు

ABN , Publish Date - Apr 07 , 2024 | 03:21 AM

లోక్‌సభ ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్‌ తనిఖీల్లో భారీగా నగదు, మద్యం, బంగారం, వెండి, ఇతర

3వారాల్లో రూ. 49 కోట్లు పట్టుబడింది:పోలీసులు

లోక్‌సభ ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్‌ తనిఖీల్లో భారీగా నగదు, మద్యం, బంగారం, వెండి, ఇతర బహుమతులు పట్టుబడుతున్నాయి. మూడువారాల్లో స్వాధీనం చేసుకున్న వాటి విలువ రూ. 49 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. మార్చి 16న ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినప్పటి నుంచి శనివారం వరకు పోలీస్‌ తనిఖీల్లో సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ. 31.12 కోట్ల నగదు పట్టుబడినట్లు డీజీపీ కార్యాలయ అధికారులు శనివారం తెలిపారు. అలాగే రూ. 3.21 కోట్లకుపైగా విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.

Updated Date - Apr 07 , 2024 | 03:21 AM