Share News

మార్చి నాటికి అన్ని గ్యారెంటీల అమలు

ABN , Publish Date - Jan 18 , 2024 | 11:10 PM

మార్చి నెల చివరి నాటికి ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చిన అన్ని గ్యారెంటీలను అమలు చేస్తామని స్థానిక ఎమ్మెల్యే జి. మధుసూ దన్‌రెడ్డి అన్నారు.

మార్చి నాటికి అన్ని గ్యారెంటీల అమలు
షాదీ ముబారక్‌ చెక్కును లబ్ధిదారుకు అందజేస్తున్న ఎమ్మెల్యే జీఎంఆర్‌

- షాదీ ముబారక్‌ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే జీఎంఆర్‌

అడ్డాకుల (మూసాపేట), జనవరి 18 : మార్చి నెల చివరి నాటికి ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చిన అన్ని గ్యారెంటీలను అమలు చేస్తామని స్థానిక ఎమ్మెల్యే జి. మధుసూ దన్‌రెడ్డి అన్నారు. మూసాపేట తహసీల్దార్‌ కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు షాదీ ముబారక్‌ చెక్‌లను గురువారం ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో నిరు పేదలందరినీ గుర్తించి అన్ని సంక్షేమ పథకాలను అందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ బ్రహ్మంగౌడ్‌, పార్టీ మండల అధ్యక్షుడు శెట్టిశేఖర్‌, నాయకులు బగ్గి కృష్ణయ్య, కండక్టర్‌ నారాయణ, తిరుపతయ్యగౌడ్‌, తాజొద్దీన్‌, లబ్ధిదారులు ఉన్నారు.

Updated Date - Jan 18 , 2024 | 11:11 PM