Share News

10మంది విద్యార్థులకు అస్వస్థత

ABN , Publish Date - Jan 28 , 2024 | 12:07 AM

మధ్యాహ్న భోజనం చేసి పది మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన సూర్యాపేటజిల్లా అనంతగిరి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో శనివారం జరిగింది.

10మంది విద్యార్థులకు అస్వస్థత
బియ్యం పరిశీలిస్తన్న తహసీల్దార్‌, ఎంఈవో

అనంతగిరి, జనవరి 27: మధ్యాహ్న భోజనం చేసి పది మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన సూర్యాపేటజిల్లా అనంతగిరి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో శనివారం జరిగింది. పాఠశాలలో మొత్తం 32మంది విద్యార్థులు ఉన్నారు. మధ్యాహ్న భోజనంలో వంకాయ కూర వండారు. విద్యార్థులు భోజనం చేసిన తర్వాత అందులో పది మంది విద్యార్థులకు వాంతుల య్యాయి. ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రుల చెప్పకుండా ఉపా ధ్యాయులు ఇళ్లకు పంపించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. పది మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యా రన్న విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ రవికుమార్‌, ఎంఈవో సలీంషరీఫ్‌, పాఠశాలను సందర్శించారు. తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చారు. తమ పిల్లలు అస్వస్థతకు గురయ్యారన్న సమాచారం కూడా ఇవ్వకుండా ఇళ్లకు పంపడం ఏమిటని అధికారులను ప్రశ్నిం చారు. దీంతో అధికారులు లోపం ఎక్కడ జరిగిందో తెలుసుకొని చర్య లు చేపడతామని అన్నారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీని మార్చాలని విద్యార్థుల తల్లిదండ్రులు తహసీల్దార్‌, ఎంఈవోకు చెప్పారు. విచారణ జరిపి చర్యలు తీసుకొని మారుస్తామని వారు నచ్చజెప్పడంతో విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Updated Date - Jan 28 , 2024 | 12:07 AM