అక్రమ నిర్మాణాలు నేలమట్టం
ABN , First Publish Date - 2024-02-06T22:27:50+05:30 IST
ఘనాపూర్ అనుంబంధ గ్రామం ఫకీర్‌టెక్యాలో మంగళవారం తెల్లవారుజామున రెవెన్యూ అధికారులు ప్రభుత్వభూమిలో వెలసిన అక్రమనిర్మాణాలను కూల్చివేశారు.
అన్నోజిగూడ, ఫకీర్‌టెక్యాలో కూల్చివేతలు
ఘట్‌కేసర్/ఘట్‌కేసర్‌రూరల్, ఫిబ్రవరి 6 : ఘనాపూర్ అనుంబంధ గ్రామం ఫకీర్‌టెక్యాలో మంగళవారం తెల్లవారుజామున రెవెన్యూ అధికారులు ప్రభుత్వభూమిలో వెలసిన అక్రమనిర్మాణాలను కూల్చివేశారు. ఎదులాబాద్ రెవెన్యూ పరిధి సర్వేనెంబర్ 1107లో అక్రమంగా నిర్మించిన 9ఇళ్ళు, 3 ప్రహారీలు పోలీసు బందోబస్తు మధ్య ఘట్‌కేసర్ ఇన్‌చార్జి తహసీల్దారు అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టారు. ఆందోళనకు దిగినవారిని అరెస్టు చేసి పోచారం ఐటీసీ పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం ఎక్స్‌కవేటర్లతో అక్రమనిర్మాణాలను కూల్చివేశారు. ఈ సందర్భంగా అశోక్‌కుమార్ మాట్లాడుతూప్రభుత్వ భూముల కబ్జాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్‌గిరి ఏసీపీ చంద్రశేఖర్, పోచారం ఐటీసీ పోలీసుస్టేషన్ సీఐ రాజు వర్మ, డీటీ సందీ్‌పరెడ్డి, రెవెన్యూ అధికారులు, పోలీసు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనుమతి లేకుండ ప్రభుత్వ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా ఉపేక్షించేంది లేదని ఘట్‌కేసర్ డిప్యూటీ తహసీల్దార్ సంధీ్‌పరెడ్డి అన్నారు. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజిగూడలో గల సర్వేనెంబర్ 3/1 వెలసిన అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. అన్నోజిగూడలో 21అక్రమ నిర్మాణాలు, 12 బెస్‌మట్టంలను కూల్చివేసినట్టు అదికారులు తెలిపారు. కూల్చివేతల్లో రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు. సిబ్బంది పాల్గొన్నారు.