అక్రమ సుద్ద నిల్వలు సీజ్
ABN , Publish Date - Jun 12 , 2024 | 10:40 PM
మారేపల్లి సమీపంలో అక్రమంగా తవ్విన సుద్ద గనిని మైనింగ్, రెవెన్యూ అధికారులు బుధవారం పరిశీలించారు.

క్షేత్రస్థాయిలో పరిశీలించిన మైన్, రెవెన్యూ అధికారులు
పెద్దేముల్, జూన్ 12 : మారేపల్లి సమీపంలో అక్రమంగా తవ్విన సుద్ద గనిని మైనింగ్, రెవెన్యూ అధికారులు బుధవారం పరిశీలించారు. అక్కడ సుద్ద తవ్వకాలు అక్రమంగా జరిగినట్లు నిర్ధారించుకున్న అధికారులు సుద్ద నిల్వలను సీజ్ చేశారు. పెద్దేముల్ మండలం మారేపల్లి గ్రామ సమీపంలో అక్రమంగా సుద్ద తవ్వకాలు జరుగుతున్నాయనే విషయమై ఆంధ్రజ్యోతి దినపత్రికలో ‘సుద్దపై గద్దల్లా.. ’ మారేపల్లిలో యథేచ్ఛగాగా సుద్ద అక్రమ తవ్వకాలు అనే శీర్షికన బుధవారం కథనం ప్రచురితమైంది. దీంతో మారేపల్లి గ్రామ సమీపంలో అక్రమంగా తవ్విన సుద్దగనిని మైన్స్, రెవెన్యూ అధికారులు ఏజీ నాగరాజు, ఆర్‌ఐ నిర్మల, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రాజిరెడ్డి పరిశీలించారు. అక్రమంగా తవ్విన సుద్దను ఓ పారిశ్రామిక వేత్తకు సంబంధించిన పట్టా భూమిలో ఆయన అనుమతి లేకుండానే డంప్ చేసినట్లు తెలుసుకున్నారు. పట్టా భూమి యజమాని నుంచి లిఖిత పూర్వకంగా సమాధానం వచ్చిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు.