Share News

సమస్యలుంటే చెప్పండి.. పరిష్కరిస్తాం

ABN , Publish Date - Dec 28 , 2024 | 11:16 PM

వృద్ధాశ్రమంలో సమ స్యలు ఉంటే చెప్పాలని, వాటి పరిష్కా రానికి చర్యలు తీసుకుంటామని లోక్‌ అదాలత్‌ చైర్‌పర్సన్‌, జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి జ్యోత్స్న గుంటి అన్నారు.

సమస్యలుంటే చెప్పండి.. పరిష్కరిస్తాం
వృద్ధుల యోగక్షేమాలు తెలుసుకుంటున్న న్యాయాధికారి జ్యోత్స్న గుంటి

- వృద్ధుల ఉచిత న్యాయ సలహా కేంద్రాన్ని తనిఖీ చేసిన న్యాయాధికారి జ్యోత్స్నగుంటి

కొల్లాపూర్‌, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : వృద్ధాశ్రమంలో సమ స్యలు ఉంటే చెప్పాలని, వాటి పరిష్కా రానికి చర్యలు తీసుకుంటామని లోక్‌ అదాలత్‌ చైర్‌పర్సన్‌, జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి జ్యోత్స్న గుంటి అన్నారు. కొల్లాపూర్‌ పట్టణంలోని విశ్వశాంతి వెల్ఫేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న వృద్ధాశ్రమం లో ఏర్పాటు చేసిన ఉచిత న్యాయ సలహా కేం ద్రాన్ని శనివారం ఆమె ఆకస్మిక తనిఖీ నిర్వ హించారు. ప్రతీ నెల సందర్శనలో భాగంగా వచ్చినట్లు న్యాయాధికారి పేర్కొన్నారు. వృద్ధు ల యోగక్షేమాలు కనుక్కొని వారికి అందుతు న్న సౌకర్యాలు, న్యాయ సేవలో భాగంగా వారి కి ఏమైనా సమస్యలు ఉంటే పారా లీగల్‌ వలంటీర్‌ ద్వారా తమ దృష్టికి వస్తే వాటి పరి ష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. అనంత రం వృద్ధులకు న్యాయాధికారి బిస్కెట్లు పంపి ణీ చేశారు. న్యాయాధికారి వెంట లోక్‌ అదాల త్‌ ఇన్‌చార్జీ బోగ హరికృష్ణ, పారా లీగల్‌ వ లంటీర్‌ మధుసూదన్‌, ఇన్‌చార్జి కోర్టు కానిస్టే బుల్‌ ఇస్మాయిల్‌, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2024 | 11:16 PM