Share News

విత్తనాలు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవు

ABN , Publish Date - May 27 , 2024 | 10:38 PM

విత్తనాలను అధిక ధరకు విక్రయిస్తే చర్యలు తప్పవ ని జిల్లా వ్యవసాయ అఽధికారి గీతారె డ్డి హెచ్చరించారు. మహాలింగపురం గ్రామంలో సోమవారం ఆమె రైతులకు అవగాహన సమావేశం నిర్వహించారు

 విత్తనాలు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవు
రైతులకు అవగాహన కల్పిస్తున్న జేడీఏ గీతారెడ్డి

- జిల్లా వ్యవసాయ అధికారి గీతారెడ్డి

శంక ర్‌పల్లి మే 27: విత్తనాలను అధిక ధరకు విక్రయిస్తే చర్యలు తప్పవ ని జిల్లా వ్యవసాయ అఽధికారి గీతారె డ్డి హెచ్చరించారు. మహాలింగపురం గ్రామంలో సోమవారం ఆమె రైతులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విత్తనాలు, ఎరువులను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలని అన్నారు. ముఖ్యంగా రైతులు విత్తనాలను లైసెన్సు కలిగి ఉన్న దుకాణదారుల వద్దనే కొనుగోలు చేయాలని, రసీదును తీసుకుని తప్పని సరిగా తీసుకోవాలని తెలిపారు. అదే విధంగా ర సీదుతో పాటుగా విత్తనాల ప్యాకెట్లను రైతులు పంటకాలం ముగిసే వరకు భద్రపరుచుకోవాలని సూచించారు. లూజు విత్తనాలను ఎట్టి పరిస్థితిలో కొనుగోలు చేయరాదని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సురేష్‌బాబు, వ్యవసాయ విస్తరణ అధికారి రమ్య, పలువురు రైతులు పాల్గొన్నారు.

పరిశీలించిన తరువాతే విత్తనాలు కొనాలి

మొయినాబాద్‌ రూరల్‌: రైతులు పరిశీలించిన తరువాతనే నాణ్యమైన విత్తనాలను కొనాలని జేడీఏ గీతారెడ్డి సూచించారు. అప్పొజిగూడలో విత్తనాలు కొనుగోలు విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సోమవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. ఖరీఫ్‌ పంటల సాగుకు రైతులు సిద్ధమవుతున్నారని.. సాగుకు సంబంధించి విత్తనాల కొనేముందు జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు సూచించారు ప్రభుత్వ అనుమతి పొందిన డీలర్ల వద్దనే కొనుగోలు చేయాలని సూచించారు. అప్పుడే సాగు విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కావని చెప్పారు. అదేవిధంగా పీఎం కిసాన్‌ రాని రైతులు, బ్యాంకు అకౌంట్‌కు ఆధార్‌లింకు లేక నగదు జమ కాని రైతులు పోస్టాఫీసులో అకౌంట్‌ ఓపెన్‌ చేసుకోవాలని జేడీఏ గీతారెడ్డి సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాఘవమ్మ, మాజీ సర్పంచ్‌ రాజు, పంచాయతీ కార్యదర్శి జ్యోష్న, ఏఈవో సునీల్‌ కుమార్‌, రైతులు పాల్గొన్నారు.

Updated Date - May 27 , 2024 | 10:38 PM