Share News

Hyderabad: బీఆర్‌ఎస్‏కు 11 ఎకరాలు కేటాయించడం అక్రమం

ABN , Publish Date - Jan 14 , 2024 | 11:03 AM

కోకాపేటలో బీఆర్‌ఎ్‌సకు భూమి కేటాయించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో మరో వ్యాజ్యం దాఖలయింది.

Hyderabad: బీఆర్‌ఎస్‏కు 11 ఎకరాలు కేటాయించడం అక్రమం

- హైకోర్టులో మరో ప్రజాప్రయోజన వ్యాజ్యం

హైదరాబాద్‌, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): కోకాపేటలో బీఆర్‌ఎ్‌సకు భూమి కేటాయించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో మరో వ్యాజ్యం దాఖలయింది. ఆపార్టీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీ అండ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ నిర్మాణం కోసం రూ.వందల కోట్ల విలువైన 11 ఎకరాల భూమిని తక్కువ మొత్తానికి కేటాయించడం అక్రమమని పేర్కొంటూ న్యాయవాది ఏ వెంకట్రామిరెడ్డి ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ పిటిషన్‌కు రిజిస్ర్టీ నెంబర్‌ కేటాయించాల్సి ఉంది. బీఆర్‌ఎ్‌సకు హైదరాబాద్‌లో ఇప్పటికే పార్టీ కార్యాలయం ఉన్నప్పటికీ అత్యంత విలువైన 11 ఎకరాల భూములను మళ్లీ కేటాయించడం అక్రమమని పేర్కొంటూ ఇప్పటికే ఫోరంఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (ఎఫ్‌జీజీ) సంస్థ కార్యదర్శి ఎం పద్మనాభ రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. అక్కడ ఎకరం మార్కెట్‌ ధర రూ. 50 కోట్లకు పైగా ఉండగా, దాన్ని రూ.3.41 కోట్లకే ఇచ్చారని తెలిపారు.

Updated Date - Jan 14 , 2024 | 11:03 AM