Share News

బీఆర్‌ఎస్‌ నేతలకు టికెట్లు ఎలా ఇస్తారు?: వీహెచ్‌

ABN , Publish Date - Mar 24 , 2024 | 05:03 AM

రాష్ట్ర ప్రజలు బీఆర్‌ఎస్‌ వాళ్లు వద్దనుకునే కాంగ్రె్‌సను గెలిపించారని, మళ్లీ ఆ పార్టీ వాళ్లను చేర్చుకుని టిక్కెట్లు ఇవ్వడం ఏంటని పార్టీ సీనియర్‌ నేత వి.హన్మంతరావు ప్రశ్నించారు.

బీఆర్‌ఎస్‌ నేతలకు టికెట్లు ఎలా ఇస్తారు?: వీహెచ్‌

హైదరాబాద్‌, మార్చి 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రజలు బీఆర్‌ఎస్‌ వాళ్లు వద్దనుకునే కాంగ్రె్‌సను గెలిపించారని, మళ్లీ ఆ పార్టీ వాళ్లను చేర్చుకుని టిక్కెట్లు ఇవ్వడం ఏంటని పార్టీ సీనియర్‌ నేత వి.హన్మంతరావు ప్రశ్నించారు. వాళ్లు పార్టీలో చేరుతుంటే.. కాంగ్రెస్‌ కార్యకర్తలు బాధపడుతున్నారన్నారు. పార్టీ కోసం ఇన్నేళ్లుగా కష్టపడుతున్న వారికి న్యాయం చేయకుండా, కొత్తగా వచ్చిన బీఆర్‌ఎస్‌ నేతలకు టికెట్లు ఇవ్వడం సరికాదన్నారు. గాంధీభవన్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలపై సీఎం రేవంత్‌ను కలిసి వివరించాలని అనుకున్నానని, కానీ తనకు ఆయన్ను కలిసే అవకాశం రావట్లేదన్నారు. సీఎం స్థానంలో ఉన్న రేవంత్‌రెడ్డి దగ్గరకే ఎవరైనా రావాలి కానీ.. ఆయన బీఆర్‌ఎస్‌ నేతల ఇళ్లకు వెళ్లి పార్టీలోకి ఆహ్వానించడం సరైంది కాదన్నారు. తాను ఎవరికీ వ్యతిరేకం కాదని, ఎవ్వరికీ అన్యాయం జరగొద్దన్నదే తన ఉద్దేశమని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ కార్యకర్తలపై గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని సీఎంను కోరారు. కాగా, దేశంలో ఎన్నికలు ఏకపక్షంగా జరిగేలా బీజేపీ కుట్ర పన్నుతోందని టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు నిరంజన్‌ ఆరోపించారు. ప్రతిపక్షాలు ఎన్నికలపై దృష్టి సారించకుండా.. ఆయా పార్టీలు, పార్టీ నేతలపైన సీబిఐ, ఈడీ, ఐటీలను ప్రయోగిస్తోందని ఆరోపించారు.

Updated Date - Mar 24 , 2024 | 05:03 AM