Share News

భద్రాద్రి అభివృద్ధికి ఎంత స్థలం కావాలో తేల్చండి

ABN , Publish Date - Mar 12 , 2024 | 03:38 AM

దక్షిణ అయోధ్య భద్రాచల పుణ్యక్షేత్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎంత స్థలం సేకరించాల్సి ఉంటుందో తేల్చండి’’ అంటూ దేవాదాయశాఖ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడి ్డ

భద్రాద్రి అభివృద్ధికి ఎంత స్థలం కావాలో తేల్చండి

నెల రోజుల్లో కలెక్టర్‌ నివేదిక ఇవ్వాలి

నీటిపారుదల, దేవాదాయశాఖల అధికారులతో సీఎం రేవంత్‌ సమీక్ష

భద్రాచలం, మార్చి 11: ‘‘దక్షిణ అయోధ్య భద్రాచల పుణ్యక్షేత్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎంత స్థలం సేకరించాల్సి ఉంటుందో తేల్చండి’’ అంటూ దేవాదాయశాఖ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడి ్డ ఆదేశించారు. సోమవారం ఆయన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు తుమ్మల, పొంగులేటితో కలిసి భద్రాచలంలో నీటిపారుదల శాఖ, దేవాదాయ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రాచలంలో ప్రభుత్వ స్థలం ఎంత ఉందో పరిశీలించాలని అధికారులకు సీఎం సూచించారు. ఆలయాభివృద్ధికి సుమారు 48 ఇళ్లను తొలిగించాల్సి ఉంటుందని అధికారులు సీఎంకు చెప్పారు. సంబంధిత ఇళ్ల యజమానులతో సుహృద్భావ వాతావరణంలో మాట్లాడాలని, వారికి న్యాయం జరిగేలా ప్రభుత్వం చూస్తుందనే భరోసా ఇవ్వాలని సీఎం సూచించినట్లు సమాచారం. ఇళ్లను కోల్పోతున్న వారికి ప్రత్యామ్నాయంగా స్థలాన్ని కేటాయించి, ఇళ్లను నిర్మించి ఇవ్వాలని, ఈ విధానాన్ని లాటరీ పద్ధతిలో నిర్వహించాలని దేవాదాయశాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌, భద్రాద్రి-కొత్తగూడెం కలెక్టర్‌ డాక్టర్‌ ప్రియాంక, దేవస్థానం ఈవో ఎల్‌.రమాదేవిలను సీఎం ఆదేశించినట్లు తెలిసింది. ఇందుకు సంబందించిన నివేదికను నెల రోజుల్లో ప్రభుత్వానికి సమర్పించాలని కలెక్టర్‌కు సూచించారు. కాగా.. సీతమ్మసాగర్‌ ప్రాజెక్టు, భద్రాద్రి కరకట్ట మిగులు పనులను నాణ్యతతో సత్వరమే పూర్తి చేయాలని, జిల్లాలో తాగునీటి ఎద్దడి లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు.

Updated Date - Mar 12 , 2024 | 03:38 AM